మేనల్లుడి దశ మారుస్తారా ? హరీష్ రావు హ్యాపీనా ?

టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్తే చాలు, కేసీఆర్ ఆ తరువాత ఆయన మేనల్లుడు హరీష్ రావు పేరు గట్టిగా వినిపించేవి.తన మామ ఎలా చెప్తే అలా నడుచుకుంటూ కష్టంలోనూ, సుకంలోనూ తాను ఉన్నాను అంటూ హరీష్ రావు ముందుంటూ పార్టీలో నెంబర్ టూ స్థానాన్ని పొందాడు.

 Does Harish Rao Happy-TeluguStop.com

అయితే అదంతా ఒకప్పుడు.ఇప్పడు హరీష్ స్థానం తగ్గిపోయింది.

కాదు కాదు తగ్గించబడింది.ఇప్పుడు హరీష్ స్థానాన్ని కేటీఆర్ లాగేసుకున్నాడు.

హరీష్ జస్ట్ ఒక సాధారణ ఎమ్యెల్యే తప్ప ఇంకా అంతకంటే ఏమీ కాదు అన్నట్టు ఆయన పరిస్థితి అయిపొయింది.హరీష్ వర్గం అన్న వారి ప్రయార్టీ కూడా తగ్గించేశారు.

అయితే కేసీఆర్ ఆ విధంగా చేయడం పార్టీలో మెజార్టీ వర్గానికి నచ్చలేదు.పార్టీ కోసం ఆరుగాలం కష్టపడ్డా హరీష్ రావు కి ప్రాధాన్యం లేకుండా చేయడం ఏంటి అనే చర్చలు కూడా పెద్ద ఎత్తున వస్తుండడంతో కేసీఆర్ కూడా ఆలోచనలో పడ్డాడట.

తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ చాలాకాలం మంత్రివర్గం లేకుండానే గెంటుకొచ్చేసారు.కేవలం హోంమంత్రి మహమూద్ అలీ మాత్రమే కేబినెట్లో ఉన్నారు.అనంతరం 2019 ఫిబ్రవరి మూడో వారంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టిన కేసీఆర్ కొత్తగా పది మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు.తనతో కలిసి మొత్తంగా 18 మందితో కేబినెట్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కూడా కేసీఆర్ మాత్రం అలా చేయలేదు.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ చేపట్టాలని భావించిన కేసీఆర్ దీనికోసం కసరత్తు మొదలుపెట్టారనే వార్తలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎక్కువయ్యాయి.

-Telugu Political News

ఈ నెల 23న లోక్ సభ ఎన్నికల ఫలితాలు రాబోతుండడంతో దానికి తగ్గట్టుగానే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేసుకుని కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టి పూర్తిస్థాయిలో ఖాళీలను భర్తీ చేయాలని కేసీఆర్ చుస్తున్నాడట.మరోవైపు తెలంగాణలో జూన్ 2 నాటికి కేబినెట్ విస్తరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కి తప్పకుండా స్థానం దక్కుతుంది అనే హడావుడి ఎక్కువయ్యింది.ఒకవేళ ఈ సారి కేబినెట్‌లో చోటు దక్కకపోతే హరీష్ రావు ప్రాధాన్యత ఇంకా దిగజారే అవకాశం కనిపిస్తోంది.

అదీ కాకుండా ఈ ఐదేళ్ల పాటు హరీశ్ రావు సాధారణ ఎమ్మెల్యేగానే ఉండాల్సి ఉంటుంది.అయితే పార్టీలో అభద్రతా భావం ఏర్పడకుండా ఉండాలి అంటే హరీష్ కు తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube