బంగాళాదుంప తింటే బరువు పెరుగుతాం....ఇది నిజామా....అపోహ....వాస్తవం తెలుసుకోండి  

Does Eating Potatoes Make You Gain Weight?-

బంగాళాదుంప అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. బంగాళాదుంపతో చిప్స్,వేపుడు, కూర‌, వెజ్ బిర్యానీ వంటి ఎన్నో వంటలను తయారుచేస్తాం..

బంగాళాదుంప తింటే బరువు పెరుగుతాం....ఇది నిజామా....అపోహ....వాస్తవం తెలుసుకోండి-

అయితే కొంత మంది బంగాళాదుంప ఎక్కువగా తింటే బరువు పెరుగుతామని, ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తారు. ఇప్పుడు దానిలో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం.సాధారణంగా అందరూ బంగాళాదుంపను తొక్క తీసేసి తింటారు.

ఆలా కాకుండా తొక్క తీయకుండా వండుకొని తింటే చాలా మంచిది. బంగాళాదుంప తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించి ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.