కరోనా వైరస్(కోవిడ్-19).ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టి పీడిస్తున్న మహమ్మారి ఇది.
చైనాలో పురుడు పోసుకున్న ఈ మాయదారి వైరస్.గత రెండు సంవత్సరాల నుంచి అటు ప్రభుత్వాలను, ఇటు ప్రజలను ముప్ప తిప్పలు పెడుతూనే ఉంది.
ఫస్ట్, సెకెండ్ వేవ్స్‌లోనే కాదు థర్డ్ వేవ్‌లోనూ వికృత రూపం దాల్చిన కరోనా.ఇప్పటికే లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది.ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు తెగ తాపత్రాయపడుతున్నారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు కరోనాపై ఎన్నెన్నో పరిశోధనలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా ఓ కొత్త పరిశోధనకు సంబంధించిన వాదన బయటకు వచ్చింది.వైన్ తాగితే కరోనా నుంచి తప్పించుకోవచ్చు అనేది దాని సారాంశం.
అలా అని వైన్ తాగితే కరోనా రానే రాదు అని అర్థం కాదు.వైరస్ సోకే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అని అంటున్నారు.
వారంలో ఒకటి నుంచి నాలుగు గ్లాసుల రెడ్ వైన్ లేదా వైట్ వైన్ లేదా షాంపైన్ తీసుకుంటే కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం పదిహేడు శాతం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వైన్‌లో పాలీఫెనాల్ అనే సమ్మేళనం ఉంటుంది.
ఇది కరోనా ఇన్‌ఫెక్షన్ వచ్చే రిస్క్‌ను తగ్గేలా చేస్తుంది.అదే సమయంలో ఫ్లూ, ఇతర శ్వాస కోశ వ్యాధులను దరి దాపుల్లోకి రాకుండా అడ్డు కట్ట కూడా వేస్తుందని ఆధ్యయనంలో తేలింది.
పైగా వైన్‌ను లిమిట్‌గా తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.వెయిట్ లాస్ అవుతారు.అధిక రక్తపోటు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.మరియు మధుమేహం సైతం కంట్రోల్‌లో ఉంటుంది.
.