'క్రాస్ ఓటింగ్' అంత భయపెడుతోందా ?  

Does Cross Voting Makes Scared-

ఎన్నికల్లో ప్రతీ చిన్న అంశమూ పెద్దగా రాజకీయ పార్టీలను భయపెడుతుంటాయి.పోలింగ్ అనంతరం ఓటర్ నాడి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటాయి.అయితే ఓటర్ మాత్రం తాను ఎవరికి ఓటు వేసానో అన్న సంగతి చెప్పకుండా రాజకీయ పార్టీలను మరింత కలవరానికి గురిచేస్తుంటారు.

Does Cross Voting Makes Scared--Does Cross Voting Makes Scared-

ఏపీలో ఇప్పుడు ముక్కోణపు పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎవరికి విజయం దక్కుతుందో అన్న టెన్షన్ అన్ని రాజకీయ పార్టీల్లో నెలకొంది.అదీ కాకుండా ఈ ఎన్నికల్లో ఓటర్లు రాత్రి వరకు బారులు తీరి మరీ ఓటు హక్కు వినియోగించుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చినీయాంశంగా మారింది.

Does Cross Voting Makes Scared--Does Cross Voting Makes Scared-

ఎప్పుడూ లేనంతగా రాత్రి 10 గంటల వరకూ మహిళలు భారీగా క్యూలో నిలబడి ఓట్లు వెయ్యడంతో ఏ పార్టీకి అనుకూలంగా ఇంత ఓటింగ్ జరిగింది అనే ప్రశ్న తలెత్తుతోంది.ఆయా రాజకీయ పార్టీలకు కూడా ఇదే టెన్షన్.పశ్చిమగోదావరి జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో జరిగిన క్రాస్‌ ఓటింగ్‌ ఎవరికి అనుకూలంగా జరిగింది, ఈ క్రాస్‌ ఓటింగ్‌తో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లతో పాటు, రెండు ఎంపీ సీట్లు, జిల్లాల్లో సగం వరకు ఉన్న రాజమహేంద్రవరం లోక్‌సభ సీటును కూడా బీజేపీతో కలిసి టీడీపీ తన ఖాతాలో వేసుకుంది.కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారు అయ్యేలా కనిపిస్తోంది.

టీడీపీకి కంచుకోట వంటి జిల్లా లో ఈసారి ఏడు, ఎనిమిది నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడం ఖాయం అయిపొయింది.ఈ జిల్లాలో ఉన్న మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ క్రాస్‌ ఓటింగ్‌ భారీ స్థాయిలో జరిగినట్టు తెలుస్తోంది.

ఏలూరు లోక్‌సభ నియోజకవర్గంలో నాలుగు నియోజకవర్గాల్లో ఎంపీ మాగంటి బాబుకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది.రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలైనా చింతలపూడి, పోలవరం, దెందులూరు నియోజకవర్గాలతో పాటు ఇదే సెగ్మెంట్‌ పరిధిలో ఉన్న కృష్ణా జిల్లాలోని కైకలూరులోనూ ఎంపీ ఓటు వరకు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి బాబుకు అనుకూలంగాపడినట్టు టీడీపీ అంచనా వేస్తోంది.

అలాగే రిజర్వ్ నియోజకవర్గమైన చింతలపూడిలో వైసీపీ అభ్యర్థి ఎలీజాకు ఓటు వేసిన వారు ఎంపీకి మాగంటికే ఓటు వేసినట్టు తెలుస్తోంది.జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు నాగబాబు పోటీలో ఉన్న నరసాపురం ఎంపీ సీటులో కూడా క్రాస్‌ ఓటింగ్‌ భారీగా జరిగిందట.

అలాగే కాపు సామాజికవర్గంలోనూ కొందరు అసెంబ్లీకి పవన్‌కు ఓటు వేసినా ఎంపీకి శివకే ఓటు వెయ్యడం విశేషం.అలాగే నరసాపురం, పాలకొల్లులో టీడీపీకి అసెంబ్లీకి ఓట్లు వేసిన కొందరు ఎంపీకి నాగబాబుకు వేసినట్టు తెలుస్తోంది.

ఈ విధంగా గజిబిజిగా జరిగిన ఈ క్రాస్ ఓటింగ్ వల్ల ఏ పార్టీకి కలిసి వస్తుంది ఏ పార్టీ కొంప ముంచుతుందో అన్నది తెలియకుండా ఉంది.ఈ టెన్షన్ మూడు పార్టీలను కలవరపెట్టిస్తోంది.