ఏపీలో అక్క‌డ మాత్రం బీజేపీకి ఆశ‌ల్లేవా… !  

Does BJP have no hopes in that place, Farmers, BJP, BJP President, Kanna Laxmi Narayana, West Godavari, Capital, Amaravati, Somu Veera Raju, Party Cadre, Krishna District, Guntur - Telugu Amaravati, Bjp, Bjp President, Capital, Farmers, Guntur, Kanna Laxmi Narayana, Krishna District, Party Cadre, Somu Veera Raju

రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పుంజుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న బీజేపీకి మొత్తం 13 జిల్లాల్లోనూ బ‌లం కావాలి.అధికారంలోకి రావాలంటే.88 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్క‌క త‌ప్ప‌దు.దీంతో పార్టీని బ‌లోపేతం  చేయాలంటే.

TeluguStop.com - Does Bjp Have No Hopes In That Place

సానుకూలంగా ఉన్న జిల్లాలు ఎన్ని.ఎక్క‌డెక్క‌డ బ‌లం ఉంది? అనే అంశాల‌పై అవ‌గాహ‌న రావాల్సి ఉంది.అయితే.అన్నింటినీ భేరీజు వేసుకున్న రాష్ట్ర బీజేపీ నాయ‌కులు.తాజాగా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.పార్టీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు జిల్లాల్లో పార్టీని ప‌టిష్టం చేసేందుకు వ్యూహాత్మ‌కంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నార‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో ఆయ‌న మొత్తం 13 జిల్లాల్లో రెండు జిల్లాల‌ను త‌న ఖాతాలోంచి తొల‌గించార‌ని అంటున్నారు.`ఆ రెండు జిల్లాలు.త‌ప్ప‌.మిగిలిన జిల్లాలైతే ఎలాంటి ఇబ్బంది లేదు“ అని సోము.

TeluguStop.com - ఏపీలో అక్క‌డ మాత్రం బీజేపీకి ఆశ‌ల్లేవా… -Political-Telugu Tollywood Photo Image

వ్యాఖ్యానిస్తున్నార‌ని పార్టీ నేత‌లు చెప్పుకొంటున్నారు.మ‌రి ఆ రెండు జిల్లాలు ఏవి?  ఎందుకు దూరం పెట్టారు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం రాజ‌ధాని అమ‌రావ‌తి! రాజ‌ధాని అమ‌రావతిని రాష్ట్ర ప్రభుత్వం తొల‌గిస్తున్న నేప‌థ్యంలో మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తున్న నేప‌థ్యంలో గుంటూరు, కృష్ణాజిల్లాల ప్ర‌జ‌లు తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నారు.

ఈ ఎఫెక్ట్ ప‌శ్చిమ‌గోదావ‌రిపై ఉన్న‌ప్ప‌టికీ.బీజేపీపై లేదు.కానీ, గ‌తంలో పార్టీకి చీఫ్‌గా చేసిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గుంటూరుకు చెందిన నాయ‌కుడు కావ‌డం, ఆయ‌న రాజ‌ధానికి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు ప్ర‌చారం చేయ‌డం వంటి ప‌రిణామాల‌తో బీజేపీపై ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆశ‌లు పెట్టుకున్నారు.అయితే, ఈ విష‌యంలో కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు చేతులు ఎత్తేయ‌డంతో రాష్ట్ర బీజేపీ నేత‌లు కూడా మౌనం పాటించారు.

అయితే, రైతుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడ‌తామ‌ని చెబుతున్నారు.కానీ, త‌మ‌కు రాజ‌ధానే కావాల‌ని ఇక్క‌డి ప్ర‌జలు ప‌ట్టుబ‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో సోము పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఇత‌ర జిల్లాలైతే బెట‌ర్ అని.ఈ రెండు జిల్లాల‌ను వ‌దులుకోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని భావిస్తున్నార‌ట‌.ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల కాలంలో తూర్పుగోదావ‌రిలో అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం ఘ‌ట‌న‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఇచ్చార‌ని.అంటున్నారు పార్టీలోని కొంద‌రు నేత‌లు.మ‌రి రాజ‌కీయంగా వ్య‌తిరేకత వ‌స్తున్న‌ప్పుడు సైలెంట్‌గా ఉండ‌డ‌మే బెట‌ర్ క‌దా.అంటున్నారు ప‌రిశీలకులు కూడా!

#Farmers #BJP President #Amaravati #KannaLaxmi #Guntur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Does Bjp Have No Hopes In That Place Related Telugu News,Photos/Pics,Images..