చిరుతో పోటీనా.. బాలయ్య ఈ వయస్సులో నీకు ఇది అవసరమా?

మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రంలో నటించడానికి ముందు చాలా బరువు తగ్గాడు.రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి బాడీపై దృష్టి పెట్టని కారణంగా పెద్ద ఎత్తున బరువు పెరిగాడు.దాంతో చిరంజీవి రీ ఎంట్రీ సమయంలో చాలా కష్టపడాల్సి వచ్చింది.

 Does Balakrishna In This Age Need Competition With Chiranjeevi-TeluguStop.com

రీ ఎంట్రీకి ముందు దాదాపుగా పది కేజీల బరువు తగ్గాడని ప్రచారం జరిగింది.ఇక ప్రస్తుతం నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రం కోసం మరో అయిదు కేజీలను చిరంజీవి తగ్గాడు.

త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చిరంజీవి చేయబోతున్నాడు.ఆ సినిమాకు కూడా మరింత బరువు తగ్గాలని దర్శకుడు సూచించాడట.

ఇలా చిరంజీవి గతంతో పోల్చితే చాలా బరువు తగ్గి నాజూకుగా కనిపిస్తున్నాడు.ఇలాంటి సమయంలో బాలయ్య కూడా తన బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడనే టాక్‌ వినిపిస్తుంది.

బాలకృష్ణ తన తర్వాత సినిమాను బోయపాటి దర్శకత్వంలో చేయబోతున్నాడు.బోయపాటి చాలా నెలల క్రితమే బాలయ్య కోసం స్క్రిప్ట్‌ రెడీ అంటూ ప్రకటించాడు.

అయితే తాజాగా సినిమా ప్రారంభంకు మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చాడు.ఇంత సమయం ఎందుకా అని అంతా ఆశ్చర్య పోయారు.

అయితే తాజాగా ఆ విషయమై క్లారిటీ వచ్చింది.

బాలకృష్ణ బరువు చాలా పెరిగాడు.

ముఖ్యంగా ఎన్టీఆర్‌ చిత్రంలో తన తండ్రిలా కనిపించేందుకు బాలయ్య లావు అయ్యాడు.మామూలుగానే లావు ఉండే బాలయ్య మరింత లావు అవ్వడంతో అభిమానులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు.

అందుకే బోయపాటి సినిమాలో చాలా సన్నగా కనిపించాలనే ఉద్దేశ్యంతో బరువు తగ్గేందుకు సిద్దం అయ్యాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య కొత్త సినిమా ఎప్పుడైతే 15 కేజీల బరువు తగ్గుతాడో అప్పుడు మొదలు అయ్యే అవకాశం ఉంది.15 కేజీల బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు.మరి అది బాలయ్యకు సాధ్యం అయ్యేనా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube