బాబు అసలు భయం అదేనా ? కోర్టుల చుట్టూ తిరగక తప్పదా ?

ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవ్వడం అంటే ఏంటో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బాగా తెలిసొచ్చినట్టుంది.వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి జైలు పక్షి అని, ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు వేసుకుంటాడని, అవినీతి కేసుల్లో ముద్దాయిని ఇలా అనేక విమర్శలు చేస్తూ వచ్చాడు.

 Does Babu Fear About Cases-TeluguStop.com

ఎన్నికల ప్రచారంలో కూడా టీడీపీ నేతలంతా ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.అయితే జగన్ మీద ఉన్న కేసులన్నీ రాజకీయ కక్షలే అన్న అభిప్రాయం మెజార్టీ ప్రజల్లో ఉంది.

అందుకే టీడీపీ అధినేతతో పాటు నాయకులు ఎంత అవహేళనగా కామెంట్స్ చేసినా జగన్ సైలెంట్ గానే ఉన్నాడు తప్ప తన కేసుల అంశాన్ని ప్రస్తావించి సానుభూతి పొందాలి అనుకోలేదు.

కానీ చంద్రబాబు మాత్రం ఆందోళనగానే కనిపిస్తున్నాడు.

తన మీద కేసులు పెడతారేమో, తనను జైలుకు పంపుతారేమో, రాష్ట్ర ప్రజలే నాకు రక్షణ కవచంలా ఉండి నన్ను కాపాడుకోవాలంటూ ఎన్నికల ప్రచారాల్లో వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచాడు.ఇక ప్రస్తుత విషయానికి వస్తే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అనేక కేసులలో స్టేలను ఎత్తివేసి విచారణను వేగం చేయాలని సుప్రీం కోర్టు ఇటీవలే హైకోర్టులకు డైరెక్షన్ ఇవ్వడంతో బాబు లో ఆందోళన మొదలయ్యింది.

ఎందుకంటే చంద్రబాబు మీద ఉన్న 27 కేసులకు సంబంధించిన స్టేలను కూడా దీనిలో భాగాంగా ఎత్తివేస్తే బాబు ఇరుకునపడ్డట్టే.

బాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మి పార్వతి ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్ మీద బాబు స్టే తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం ఆ స్టే కాస్త ఎత్తేసారు.ఏసీబీ కోర్టు ఇటీవలే లక్ష్మీపార్వతి అభిప్రాయాన్ని స్వీకరించిందని, కేసు విచారణకే ఆమె మొగ్గు చూపారని అంటున్నారు.

ఈ కేసుతోపాటు ఇతర కేసుల మీద ఉన్న స్టేలను కూడా తొలగిస్తే చంద్రబాబుకు తిప్పలు మాములుగా ఉండవు.ఇక కోర్టుల చుట్టూ తిరగడానికే బాబు సమయమంతా సరిపోతుంది.

అందుకే తాను ఈ కేసుల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలని బాబు ఆశపడుతున్నాడు.పిలిచినా పిలవకపోయినా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube