ఆయనొస్తే : ఏపీ రాజధాని మార్చేస్తారా ?

జగన్ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని మార్చేస్తాడు.అమరావతి లో రాజధాని ఏర్పాటు చేయడం జగన్ కు అస్సలు ఇష్టం లేదు.

 Does Ap Capital Changes If Jagan Wins-TeluguStop.com

అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అనేకసార్లు అనేక సందర్భాల్లో మాట్లాడాడు.అయితే ఇప్పుడు ఏపీలో కూడా జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నట్టు అనేక సర్వేల ద్వారా బయటకి రావడంతో రాజధాని అంశం మరోసారి తెర మీదకు వచ్చింది.

దీనికి తగ్గట్టుగానే జగన్ సీఎం అయితే ఏపీ రాజధాని అమరావతి కాదన్నట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు.మరీ ముఖ్యంగా ఒంగోలు నేతలు దోనకొండపై దృష్టి పెట్టారు.

దోనకొండలో భూముల కొనుగోళ్లకు తెరలేపారు.దీంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో వైసీపీ నాయకులు,రియల్‌ ఎస్టేట్‌ దళారుల తాకిడి పెరిగినట్టు ప్రచారం మొదలయ్యింది.

అప్పుడే జిల్లాలోని ఇతర ప్రాంత వాసులతో పాటు విజయవాడ, హైదరాబాద్ నుంచి కూడా భూములను పరిశీలించి కొనేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇప్పుడు వైసీపీ నాయకులతో పాటు జగన్ ఖచ్చితంగా గెలుస్తాడు అని అనుకుంటున్నా వారంతా దొనకొండవైపు చూస్తున్నారు.గత ఎన్నికల తరువాత రాష్ట్రంలో వైసీపీ గెలిచి, జగన్‌ సీఎం అవుతారన్న నమ్ముతున్న వారంతా దోనకొండవైపు చూస్తున్నారు.2014 ఎన్నికల ముగిసిన తర్వాత రాజధాని ప్రాంతాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై అనేక తర్జన భర్జనలు జరిగాయి.రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలనీ కొందరు అంటే మరికొందరు విజయవాడ గుంటూరు మధ్యనే రాజధాని ఉండాలని డిమాండ్ చేశారు.అవేవీ కాదు ప్రకాశం జిల్లా దోనకొండ అని మరో ప్రతిపాదన కూడా తెరపైకి తీసుకొచ్చారు.

కానీ బాబు మాత్రం గుంటూరు జిల్లా తాడేపల్లివైపే మొగ్గుచూపారు.కాకపోతే అప్పట్లో వైసీపీ అధికారాన్ని చేపడితే దొనకొండ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుందన్న ఊహాగానాలు వచ్చాయి.

-Telugu Political News

కడప జిల్లాకు చెందిన వారు, ప్రత్యేకించి వైసీపీలో కొందరు ముఖ్యనాయకులు అప్పట్లో ఆప్రాంతంలో ముందస్తుగానే భూములు కొనుగోలు చేసినట్టు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ప్రస్తుతం జగన్ ఖచ్చితంగా గెలుస్తాడు అనే ధీమా ఉండడంతో వైసీపీ నేతలంతా అలర్ట్ అవుతున్నారు.ఎందుకంటే పార్టీ మేనిఫెస్టోలో కూడా అమరావతి కోసం ఒక్క ముక్క కూడా చెప్పలేదు జగన్.దీంతో జగన్ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని ఏర్పాటులో మార్పులు చోటు చేసుకుంటాయనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

జగన్ సీఎం అవుతారన్న ధీమాతోనే దోనకొండలో భూముల కొనుగోళ్లు అమ్మకాలు పెరిగినట్టు సమాచారం.కానీ రాజధాని విషయంలో మాత్రం జగన్ మనసులో ఏముంది అనే విషయం మాత్రం ఎవరికి అంతుబట్టడంలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube