ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

ఒకప్పుడు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, గోవింద్, అజయ్ దేవగన్, తదితర స్టార్ హీరోల సరసన నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ “కరిష్మా కపూర్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.కాగా కరిష్మా కపూర్ 1991వ సంవత్సరంలో బాలీవుడ్ ప్రముఖ హీరో హరీష్ కుమార్ హీరోగా నటించిన “ప్రేమ ఖైదీ” అనే చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది.

 Does Anyone Remember The Heroine Seen In This Little Photo-TeluguStop.com

ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.దీనికితోడు కరిష్మా కపూర్ తల్లిదండ్రులు కూడా సినిమా పరిశ్రమకు చెందిన వారు కావడంతో ఈ అమ్మడి సినిమా ఎంట్రీ చాలా సులభం అయింది.

కాగా ఈ మధ్య కాలంలో కరిష్మా కపూర్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.కాగా తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఖాతా ద్వారా తన చిన్నప్పటి ఫోటోలు షేర్ చేసింది.

 Does Anyone Remember The Heroine Seen In This Little Photo-ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ ఫోటోలో కరిష్మా కపూర్ చాలా ముద్దుగా కనిపిస్తూ ఇల్లు ఆకారంలో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్ ని తన పక్కన ఉంచుకుని కనిపించింది.దీంతో కొందరు స్టార్ సెలబ్రిటీలు ఈ ఫోటో పై స్పందిస్తూ “సో క్యూట్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం కరిష్మా కపూర్ అధికారికి ఇంస్టాగ్రామ్ ఖాతాని దాదాపుగా 60 లక్షల పై చిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

అయితే ఈ విషయం వుండగా ఈ మధ్య కాలంలో కరిష్మా కపూర్ కొంతమేర సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది.అయితే కరిష్మా కపూర్ దగ్గరి బంధువైన కరీనా కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నటిస్తోంది.అంతేకాకుండా ఈ అమ్మడు తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది.

#Karisma Kapoor #DoesAnyone #Social Media #Harish Kumar #Handbag

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు