ధర్మవరం సుబ్రహ్మణ్యం చెప్పిన ఈ 9848032919 నెంబర్ ఎవరిదో తెలుసా?

మనం ఏదైనా సినిమాలు, సీరియల్స్ చూసినప్పుడు అందులో కొన్ని సన్నివేశాల్లో ఇతరులతో మాట్లాడడానికి లేక ఇంకేదైనా విశేష సందర్భాలు వచ్చినప్పుడు ఫోన్ వాడే సందర్భాలు, ఫోన్ నెంబర్ ను చూపించడం, వినడం వంటివి వస్తుంటాయి.అలాంటి నెంబర్లు వస్తే చాలా మంది ప్రేక్షకులకు ఈ నెంబర్ ఎవరిది, ఎవరు మాట్లాడుతారో అని ఆలోచనలు రావడం వాస్తవమే.

 Does Anyone Know The A Number 9848032919 Mentioned By Dharmavaram Subrahmanyam-TeluguStop.com

అయితే అట్లా అనుకున్న వాళ్లల్లో కొందరు మనకెందుకులే అనుకోగా, మరికొందరు డయల్ చేసే వాళ్లు కూడా ఉంటారు.కాగా ఇలాంటి సంఘటన నిజంగానే మహేష్ బాబు సినిమా లో జరిగింది.

గుణశేఖర్ దర్శకత్వంలో 2003 లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘సినిమా ‘ ఒక్కడు.ఈ సినిమాలో మహేష్ బాబు, భూమిక నటీనటులుగా చేశారు.అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ధర్మవరం సుబ్రహ్మణ్యంను ఆట పట్టించడానికి మహేష్ బాబు 9848032919 అనే నెంబర్ తో ఆట పట్టించిన సంగతి మనకు తెలిసిందే.ఇంకా ఆలా చెప్పిన ఈ నెంబరు ఎవరిది అంటే ఈ సినీ నిర్మాత ఎం.ఎస్.రాజు ది అట.

 Does Anyone Know The A Number 9848032919 Mentioned By Dharmavaram Subrahmanyam-ధర్మవరం సుబ్రహ్మణ్యం చెప్పిన ఈ 9848032919 నెంబర్ ఎవరిదో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ సీన్ కోసం ఈయన నంబర్ ఇద్దామని అందరు కలిసి ప్లాన్ చేశారట.కాగా సినిమా వచ్చాక ఆ నెంబర్ కు కొన్ని లక్షల మంది ఫోన్ కాల్స్ వచ్చాయట.

ఇక ఈ బాధను తట్టుకోలేక ఆ నంబర్ ని తీసేశారట ఎమ్.ఎస్.రాజు.కాగా ఇప్పటికీ ఇలాంటి నెంబర్లను డయల్ చేసేవాళ్లను మనం చూస్తుంటాం.

బయట ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవలసి వస్తుందని ప్రస్తుతం సినిమాల్లో నెంబర్లను ఎక్కడో ఓ చోట తక్కువగా చూపిస్తున్నారట.ఒకవేళ ఫోన్ నెంబర్ చెప్పే సన్నివేశం వస్తే వాయిస్ స్పీడ్ ను చేయడం లేదా కట్ చేయడం లాంటివి చేస్తారట.

ఏది ఏమైనా ఈ నెంబర్ చెప్పడానికి చాలా బాగుంటుంది కదా! 9848032919.

#Okkadu #Raju #Phone Number

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు