వైరల్ వీడియో: 15 ఏళ్ల తర్వాత కోమాలో ఉన్న సౌదీ ప్రిన్స్ హాయ్ చెప్పిన వేళ..!

తాజాగా ఓ సౌదీ ప్రిన్స్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.15 సంవత్సరాల నుండి కోమాలో ఉన్న ఆ సౌదీ ప్రిన్స్ సడన్ గా అనుకోని రీతిలో మాటలకు స్పందిస్తున్నాడు.తనని హాయ్ అని పలకరిస్తుంటే హాయ్ అంటూ ఉన్నట్టుగా అతని చేతులు కదుపుతున్నాడు .ఇక ఈ విషయానికి సంబంధించి తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతోంది.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

 Doctors Suadhi Prince Coma-TeluguStop.com

2005 సంవత్సరంలో సౌదీ ప్రిన్స్ అల్ వలీద్ బిన్ ఖలీద్ అల్ సౌద్ అని వ్యక్తి కోమాలోకి వెళ్ళాడు.అతడు మిల్ట్రీ కళాశాలలో చదువుతున్న సమయంలో అనుకోకుండా ఓ కారు ప్రమాదానికి గురికావడంతో ఈ ప్రమాదంలో అతనికి బ్రెయిన్ హేమరేజ్ కారణంతో ఆయన కోమాలోకి చేరుకున్నారు.దీంతో గత 15 సంవత్సరాల నుండి ఆయన హాస్పిటల్లో వెంటిలేటర్ సహాయంతో మంచానికి పరిమితం అయిపోయాడు.

అయితే ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి మాత్రం తన శరీరాన్ని కదల్చినట్లుగా వైద్యులు చెబుతున్నారు.అయితే ఇప్పుడు మాత్రం ఆయన చేతులు కదిలిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Doctors Suadhi Prince Coma-వైరల్ వీడియో: 15 ఏళ్ల తర్వాత కోమాలో ఉన్న సౌదీ ప్రిన్స్ హాయ్ చెప్పిన వేళ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ వీడియోలో ఓ మహిళ అతనికి హాయ్ అని పలకరిస్తుంటే అందుకు ప్రిన్స్ తన చేతి వేళ్ళతో స్పందిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది.అతడు కూడా హాయ్ అన్నట్లుగా తన చేతి వేళ్ళను కదిలిస్తూ ఉన్నాడు.

అలా పలుమార్లు ఆవిడ హాయ్ అని పలకరిస్తుంటే ప్రిన్స్ కూడా హాయ్ అన్నట్టుగానే చేతులు కదిలిస్తున్నాడు.అయితే ఇందులో భాగంగానే ఆవిడ తాజాగా ఒక్కసారి తన చేయి పైకి లేపాలి అని అడగగా.

అందుకు అతడు అలాగే చేశాడు కూడా.ఆ తర్వాత ఇంకొంచెం పైకి లేపాలని అడగడంతో చేయని మరింతగా పైకి ఎత్తాడు.

#Doctors #SaudhiPrince #Social Media #SaudiPrince #Al-WaleedBin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు