వ్యక్తి చనిపోయాడు అని చెప్పిన వైద్యులు.. పోస్టుమార్టం గదికి తీసుకు వెళ్ళగానే..?!

ఒక మనిషికి ప్రాణం పోయాలంటే అది ఒక్క డాక్టర్స్ వల్లనే అని అందరం నమ్ముతాము.దేవుడికి ఎలా అయితే చేతులెత్తి మొక్కుతామో, డాక్టర్ కి కూడా అలానే చేతులెత్తి దండం పెడతాం.

 Doctors Send A Man For Postmortem Who Is Actually Alive In Karnataka Mahalingpur-TeluguStop.com

ఎందుకంటే ప్రాణం పొసే శక్తి దేవుడికి ఉంటే, ఆ ప్రాణాన్ని కాపాడే శక్తి డాక్టర్స్ కి ఉంటుంది కాబట్టి.కానీ ఆ డాక్టర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఎన్నో ప్రాణాలు పోతాయి అన్నది కూడా అంతే నిజం.

ఇప్పుడు అలాంటి ఒక విచిత్రమైన సంఘటన ఒక యువకుడి విషయంలో జరిగింది.చావు బతుకుల మధ్య ఉన్న యువకుడిని చనిపోయాడని కర్ణాటకలోని మహాలింగ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు భావించి పోస్ట్‌మార్టం కోసం పంపిన ఘటన ఒకటి ఇప్పుడు వైరల్ అయింది.

 Doctors Send A Man For Postmortem Who Is Actually Alive In Karnataka Mahalingpur-వ్యక్తి చనిపోయాడు అని చెప్పిన వైద్యులు.. పోస్టుమార్టం గదికి తీసుకు వెళ్ళగానే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తీరా పోస్ట్‌మార్టం కోసం అన్నీ సిద్దం చేశాక ఆ యువకుడిలో కదలికలు చూసి షాక్ అయ్యారట.

వివరాల్లోకి వెళ్తే.

బాగల్‌కోట్ జిల్లాలోని మహాలింగ్‌పూర్‌లోని రబాకావీ రోడ్‌లో ఫిబ్రవరి 27న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 27 సంవత్సరాల శంకర్ గోంబీ అనే వ్యక్తి గాయపడ్డాడు.ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న ఆ యువకుడిని బెల్గాంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషయంగా ఉండటంతో అక్కడి నుంచి అంబులెన్స్‌లో మహాలింగ్‌పూర్‌లోని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించాలని భావించారు.మార్గమధ్యంలో అతడు ఎటువంటి చలనం లేకుండా ఉండటంతో చనిపోయాడనుకున్నారు.

మహాలింగ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కూడా అతడు చనిపోయాడని ధృవీకరించారు.చనిపోయాడు కదా అని పోస్టుమార్డం కోసం తరలించారు.

పోస్టుమార్టం రూమ్‌లో చనిపోయాడనుకున్న యువకుడి భుజాలు, కాళ్లు కదలడంతో తిరిగి మళ్ళీ ఆస్పత్రిలోకి జాయిన్ చేసారు.

ఇది ఇలా ఉండగా తన ఫ్రెండ్ చనిపోయాడని భావించి ఆ యువకుడి ఫ్రెండ్స్‌తో పాటు ప్రేయసి కూడా రెస్ట్ ఇన్ పీస్ అంటూ వార్తలు పోస్ట్ చేసి అతడి ఫోటోలు జతచేసి ఒక విచారకరమైన పాటలతో వీడియో కూడా రూపొందించి పోస్ట్ చేసారు అతడి బ్రతికే ఉన్నాడన్న వార్త తెలియడంతో స్నేహితులతో పాటు శంకర్ ప్రియురాలు సోషల్ మీడియా నుంచి పోస్టులను తొలగించింది.

ఇప్పుడు ఈ ఘటన సోసల్ మీడియా వ్యాప్తంగా వైరల్‌గా మారింది. డాక్టర్స్ నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలి అయ్యేదని నెటిజన్లు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు.

#Dead Body #Postmortem #Mahalingpur #Karnataka #Shankar Gombi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు