మొబైల్ ఫోన్ల వలన ఆ ప్రమాదం త్వరగా వస్తోందట

ప్రెస్బియోపియా .ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? సైంటిఫిక్ పేరు చెబితే అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కాని, సాధారణ భాషలో చెప్పాలంటే కంటిచూపు దెబ్బతినటం.దగ్గరున్న వస్తువులు కూడా సరిగా కనిపించకపోవడం, కనులు బరువుగా అనిపించటం .ఇలాంటివి అన్నమాట.ఈ కండీషన్ సాధారణంగా 40-50 ఏళ్ళ వయసులో మొదలవుతుంది (అందరికి కాదు).కాని మొబైల్ ఫోన్ల వలన ప్రెస్బియోపియా అంతకన్నా ముందే వచ్చే ప్రమాదం పెరిగిపోతోందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.

 Doctors Say That Mobile Phones Are Causing Presbyopia At An Early Age-TeluguStop.com

వరల్డ్ హెల్త్‌ ఆర్గనైజేషన్ రిపోర్టు ప్రకారం 2005 వరకు ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది ఈ సమస్యతో ఇబ్బందితో బాధపడేవారట.ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల రాకతో పది సంవత్సరాల్లో ఈ సంఖ్య డబుల్ అయిందట.

మనదేశం గురించి చెప్పాలంటే, ప్రెస్బియోపియాతో ఇబ్బందిపడుతున్న వారిలో 65% మంది ఇంకా 30-35 ఏళ్ళ వయసులోనే ఉన్నారట.ఇక మీరే అర్థం చేసుకోండి .మన యువతను ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో.

అంటే .దురదృష్టం కొద్ది 50 ఏళ్ళ వరకు రావాల్సిన సమస్యని, ఓ 20 ఏళ్ళ ముందుగానే కష్టపడి మరి కొనితెచ్చుకుంటున్నాం అన్నమాట.రాబోయే తరం 20-25 సంవత్సరాల వయసులోనే ఈ సమస్యని చూస్తారేమో!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube