అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళకు శస్త్ర చికిత్స

హీరో గోపీ చంద్ హీరో గా బాంబే బ్లడ్ గ్రూప్ కి సంబంధించి ఒక సినిమా వచ్చిన విషయం తెలిసిందే.ఈ చిత్రంలో విలన్ తన హార్ట్ ప్రాబ్లమ్ కు ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వారి కోసం వెతుక్కుంటూ వారి ప్రాణాలను తీసి మరి అతడి హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకోవాలని చూస్తాడు.

 Doctors Save Pregnant Women With Rare Blood Group-TeluguStop.com

హీరో ది కూడా అదే బ్లడ్ గ్రూప్ కావడం తో విలన్,హీరో మధ్య వార్ చివరికి విలన్ చనిపోవడం జరుగుతుంది.ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు అని అనుకుంటున్నారా.

అంటే ఈ బాంబే బ్లడ్ గ్రూప్ అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చాలా తక్కువ మంది ఉంటారు.

ఇలాంటి వారికి శస్త్ర చికిత్స చేయడం చాలా కష్టం కూడా.కానీ అలాంటి బ్లడ్ గ్రూప్ ఉన్న 39 ఏళ్ల గర్భిణీ కి హైదరాబాద్ లోని ఎస్ ఎల్ జీ ఆసుపత్రి వైద్యులు ఒక శస్త్ర చికిత్స చేశారు.

ఆమె కు శస్త్ర చికిత్స నిర్వహించి ట్యూబుల్లో అసాధారణగా పెరిగిన పిండాన్ని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి వైద్య బృందం తొలగించినట్లు తెలుస్తుంది.వాస్తవానికి ఆమె గర్భసంచిలో పెరగాల్సిన పిండం ఫెలోపియన్‌ ట్యూబుల్లో పెరిగినట్లు గుర్తించిన డాక్టర్ల బృందం అసాధారణ పెరుగుదల కారణంగా ఆమెకు ప్రాణాపాయం ఏర్పడుతుందని గమనించారు.

దీనితో ఆమెకు రక్త పరీక్షలు చేయగా ఆమెది బాంబేబ్లడ్‌ గ్రూప్‌గా నిర్ధారణ కు వచ్చిన డాక్టర్లు దానికి తగ్గట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.ప్రధాన కారణం ఈ బ్లడ్‌ గ్రూపు చాలా తక్కువగా మాత్రమే లభ్యమవుతుంది.

Telugu Bombay, Doctors, Doctorssave, Pregnant Bombay-

రక్తాన్ని భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయంగా ‘ప్లాస్మా వాల్యూమ్‌ ఎక్స్‌ పాండర్స్‌’ను ఆమెకు ఎక్కించి ఇలా ఈ శస్త్ర చికిత్స చేసినట్లు గైనకాలజిస్టు సువర్ణరాయ్‌ వివరించారు.దీనితో ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి ట్యూబుల్లో ఉన్న పిండాన్ని తొలగించినట్లు చెప్పారు.దాదాపు 10వేల మందిలో ఒకరికి మాత్రమే ఈ గ్రూపు ఉంటుంది.మొత్తం హైదరాబాద్‌లో ఈ రక్తం గ్రూపు ఉన్న వారు కేవలం 15-20 మంది మాత్రమే ఉంటారట.

ఇలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్న ఆ మహిళకు శస్త్ర చికిత్స నిర్వహించి ఆమె ప్రాణాలను కాపాడారు ఎస్ ఎల్ జీ ఆసుపత్రి వైద్యులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube