‘టూత్ బ్రష్’ను మింగిన వ్యక్తి.. చివరికి ఏమైందంటే?  

doctors remove tooth brush from arunachal mans stomach after he swallowed doctors, tooth brush, arunachal pradesh, stomach, swallowed - Telugu Arunachal Pradesh, Doctors, Stomach, Swallowed, Tooth Brush

సాధారణంగా పళ్లు తోముతున్న అప్పుడు పేస్టు తినడం సర్వసాధారణమే కానీ ఇక్కడ ఒక అతను ఏకంగా బ్రష్ నే మింగేశాడు.ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? అరుణాచల్ ప్రదేశ్ లోని పసీఘాట్‌కు చెందిన 39 ఏళ్ల వ్యక్తి తన పళ్ళను తోముతూ, అలాగే గొంతు కూడా శుభ్రం చేసుకోవాలనే ఉద్దేశంతో తన బ్రష్ మొత్తం నోట్లో పెట్టాడు.అయితే పొరపాటున గుటక రావడంతో బ్రష్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది.తీయడానికి ప్రయత్నించినా సాధ్యంకాలేదు.భయంతో హుటాహుటిన ఆస్పత్రికి పరుగు పెట్టాడు.జరిగిన విషయం మొత్తం డాక్టర్లకు వివరించి చెప్పగా, అక్కడి వైద్యులు బకిన్ పెర్టిన్ జనరల్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.

TeluguStop.com - Doctors Remove Tooth Brush From Arunachal Mans Stomach After He Swallowed

అక్కడికి వెళ్ళిన ఆ వ్యక్తి వైద్యులకు తన సమస్య గురించి చెప్పాడు.అయితే డాక్టర్లు తను ఎక్సరే తీసి బ్రష్ ఎక్కడుందో గుర్తించే ప్రయత్నం చేశారు.అయితే ఆ బ్రష్ అన్నవాహిక ప్రాంతంలో ఎక్కడా కనిపించలేదు.అంటే ఆ బ్రష్ గొంతులో నుంచి నేరుగా కడుపులోకి వెళ్ళి ఉండవచ్చని డాక్టర్లు భావించారు.

అతనికి ఏమైనా సమస్యగా ఉందని డాక్టర్లు ఆరా తీయగా, పొత్తి కడుపు పై భాగంలో కొద్దిగా ఇబ్బంది తలెత్తుతున్నట్లు అతడు డాక్టర్లకు తెలియజేశాడు.అయితే బ్రష్ అక్కడే ఉంటుందని డాక్టర్లు భావించారు.

TeluguStop.com - టూత్ బ్రష్’ను మింగిన వ్యక్తి.. చివరికి ఏమైందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

దానిని అలాగే ఉంచడం వల్ల అంతర్గత సమస్యలు ఏర్పడే అధిక రక్తస్రావం అవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి, అతనికి అనస్తీషియా ఇచ్చి, చిన్న సర్జరీ ద్వారా బ్రష్ ను బయటకు తీశారు.ఇద్దరు డాక్టర్లు సుమారు 30 నిమిషాల పాటు చేసిన సర్జరీ విజయవంతం అయింది.

అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రస్తుతం ద్రవపదార్థాలను మాత్రమే స్వీకరిస్తూ ఉన్నాడని, త్వరలో తన ఆరోగ్యం నిలకడగా ఉంటుందని డాక్టర్లు తెలిపారు.అయితే ఇదే తరహాలో గత ఏడాది చైనాలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి బ్రష్ మింగాడు.

అయితే అతను తీవ్ర అస్వస్థతకు గురి కావడం వల్ల డాక్టర్లను సంప్రదించి విషయం చెప్పాడు.శస్త్రచికిత్స చేసి ఆ బ్రష్ బయటకు తీశారు.

#Stomach #Swallowed #Tooth Brush #Doctors

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Doctors Remove Tooth Brush From Arunachal Mans Stomach After He Swallowed Related Telugu News,Photos/Pics,Images..