వామ్మో! కిడ్నీలో 206 రాళ్లు తొలగించిన వైద్యులు.. దీనికోసం ఆ సర్జరీని వాడారట!

సాధారణంగా మనం ఓ మామ్మూలు కడుపునొప్పి వస్తేనే భరించలేము.నానాయాతలు పడుతూ, ఇంటిల్లిపాదికీ చుక్కలు చూపిస్తాం.

 Doctors Remove 206 Kidney Stones , Kidney , Stones 206 , Viral Latest , Viral Ne-TeluguStop.com

అలాంటిది కిడ్నీలో ఏకంగా 206 రాళ్లు ఉంటే ఆ నరకం ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించి చెప్పలేము.అయితే అతగాడు 6 నెలలుగా కిడ్నీలో వున్న 206 రాళ్లు వలన భరించలేని నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.

ఇక తాజాగా అవేర్ గ్లెనేజిల్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్సతో ఆ రాళ్లన్నింటిని తొలగించారు.వివరాల్లోకి వెళితే, నల్లగొండ జిల్లాకు చెందిన వీరమల్ల రామలక్ష్మయ్య నొప్పిని తట్టుకునేందుకు స్థానిక హెల్త్ ప్రాక్టిషనర్ దగ్గర చికిత్సతో తాతాల్కిక ఉపశమనం పొందేవాడు.

అయితే ఒకరోజు నొప్పి భరించలేకుండా మారడంతో విధులు కూడా నిర్వర్తించలేకపోయాడు.దాంతో ఆసుపత్రికి వెళ్ళాడు.అవేర్ గ్లెనేజిల్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పూల నవీన్ కుమార్ రామ లక్ష్మయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మూత్రపిండిల్లో ఎడమ వైపు రాళ్లు ఉన్నట్లు నిర్దారించారు.కాగా లక్ష్మయ్య వయస్సు 56 సంవత్సరాలు.

సీటీ క్యూబ్ స్కాన్ ద్వారా అతగాడి కిడ్నీల్లో చాలా ఎక్కువ రాళ్లు ఉన్నట్టు నిర్దారించుకున్నారు.దీంతో రామలక్ష్మయ్యకు వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చి, “కీ హోల్ సర్జరీకి” రెడీ చేశారు.

దాదాపు గంట సేపు సర్జరీ చేసి ఆ రాళ్లన్నీంటిని తొలగించారు.

Telugu Aware Gleneagle, Doctorsremove, Drpula, Keyhole Surgery, Kidney, Latest-L

ఇక 206 రాళ్లు చూసి ఆసుపత్రిలో అందరూ ఖంగు తిన్నారు.ఇలాంటి సర్జరీ చేయడం తమకి సాధారణం అని, అయితే ఈ స్థాయిలో రాళ్లు ఉండటం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని అక్కడి డాక్టర్లు చెప్పడం కొసమెరుపు.కాగా సర్జరీ అనంతరం కోలుకున్న రామలక్ష్మయ్య రెండో రోజే ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేసినట్లు వైద్యులు తెలిపారు.

ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ కేసులు పెరిగిపోతున్నాయని వైద్యులు తెలిపారు.డీ హైడ్రేషన్ వల్లే కిడ్నీల్లో రాళ్లు ఏర్పాడుతున్నాయన్నారు.డీ హైడ్రేట్ కాకుండా మంచినీరు, కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube