నమ్మలేని నిజం : అందరి ఆరోగ్యాన్ని పరీక్షించే డాక్టర్..తన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు.. కడుపులో ఏకంగా 10000 రాళ్లు ..

సాధారణంగా కిడ్నిల్లో రాళ్లు అనే సమస్యను మనం నిత్యం ఎవరో ఒకరి దగ్గర వింటూనే ఉంటాం…అయితే కిడ్నీల్లోనే కాకుండా కొందరికి పేగుల్లో మరో చోట కూడా ఇలాంటి రాళ్లు ఏర్పడుతుంటాయి.అవి మహా అంటే పదుల సంఖ్యలో ఉండొచ్చు.

 Doctors Remove 10000 Stones From Nutritionists Gallbladder-TeluguStop.com

వాటిని డాక్టర్లు శస్త్ర చికిత్సలు చేసి తొలగిస్తుంటారు.కానీ మన ఆరోగ్యం గురించి సలహాలిచ్చే డాక్టర్లకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదనుకుంటే పొరపాటే.

ఒక డాక్టర్ పిత్తాశయంలో ఏకంగా 10,000 రాళ్లు బయటపడి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

చౌదరి అనే డాక్టర్ దాదాపు నెలన్నర పాటు తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బందిపడ్డాడు.వృత్తిరిత్యా అతను ఒక న్యూట్రిషియన్.కోల్ కత్తలోనివాసం ఉంటాడు.

అయితే ఆ సమస్యను అతను కాస్త లైట్ గా తీసుకున్నాడు.సమస్య తీవ్రత పెరిగిన తర్వాత డాక్టర్ని సంప్రదించాడు.

డాక్టర్లు స్కానింగ్ చేస్తే అతని పిత్తాశయంలో (గాల్ బ్లాడర్) రాళ్లు ఉన్నట్లు తేలింది.దీంతో వెంటనే శస్త్ర చికిత్స చేపట్టారు.

అయితే రాళ్లు తీసేకొద్దీ బయటకు వస్తుండడంతో డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు.అన్ని రాళ్లు పిత్తాశయంలో ఎలా ఏర్పడ్డాయి వైద్యులకు కూడా అర్థం కాలేదు.మొత్తం10,356 రాళ్లను పిత్తాశయంలో నుంచి బయటికి తీశారు.40నిమిషాలపాటు శస్త్రచికిత్స చేసి రాళ్లను తొలగించారు.కాని బయటకు తీసిన రాళ్లను లెక్కించడానికి సిబ్బందికి ఎక్కువ సమయం పట్టింది.

కోల్ కత్తాలో ఇలాంటి కేసు ఇది రెండోది కావడం విశేషం.కొన్ని రోజుల క్రితం కూడా ఇలాంటి కేసునే డాక్టర్స్ డీల్ చేశారు.కొన్ని రోజుల క్రితం కోల్ కత్తాలో డాక్టర్ మఖన్లాల్ సహ ఒక రోగికి ఆపరేషన్ చేసి 12,000 రాళ్లను తొలగించాడు.

కొందరికి కడుపులో సడెన్ గా పెయిన్ వస్తుంటుంది.తీరా డాక్టర్ వద్దకు వెళ్తే గాల్ బ్లాడర్ సమస్య అని చెబుతారు.గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడడానికి ప్రధానంగా కొన్ని కారణాలున్నాయి.గాల్ బ్లాడర్ కాలేయానికి అనుసంధానంగా ఉంటుంది.

లివర్ లోని పైత్యరసం గ్లాస్ బ్లాడర్ లో నిల్వగా ఉంటుంది.సరైన సమయానికి భోజనం తినకపోవడం, కొలెస్ట్రాల్ వల్ల గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడుతాయి.

సో.ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి జబ్బుల బారిన పడే అవకాశం ఉంది.కాబట్టి తస్మాత్ జాగ్రత్త.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube