ఆ మెడిసిన్ వేసుకునే వారికి కరోనా ముప్పు తక్కువ?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం అంతాఇంతా కాదు. భారత్ లో గత 24 గంటల్లో 75,809 కరోనా కేసులు నమోదు కాగా 1,133 మంది మృతి చెందారు.

 Famocide Medicine For Corona Patients, Corona Effect, Medicine, Ulcer Problems,-TeluguStop.com

కరోనా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉన్నాయి.కొంతమందికి వైరస్ సోకినా కరోనా లక్షణాలు కనిపించడం లేదు.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లైతే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోంది.కరోనా వైరస్ జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మలంలో ఆరు వారాల పాటు కరోనా వైరస్ ఉంటుందని అయితే మలంలో ఉండే వైరస్ వల్ల ప్రమాదమో కాదో ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు.కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కడుపుబ్బరం సమస్య ఎక్కువగా కనిపిస్తోందని… కడుపులో చెడు బ్యాక్టీరియా పెరగడం వల్ల ఇలా జరుగుతోందని వైద్యులు తెలుపుతున్నారు.

కరోనా బారిన పడిన వారిలో కొందరు కాలేయ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారని చెబుతున్నారు.

అయితే వైద్యులు, శాస్త్రవేత్తలు కారణాలు తెలియకపోయినా అల్సర్ కోసం వాడే ఫామోసిడ్ ను ఇప్పటికే వినియోగిస్తున్న వారికి కరోనా ముప్పు తక్కువగా ఉందని తెలిపారు.

ప్రస్తుతం కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులు సైతం రోగులకు ఫామోసిడ్ ను సూచిస్తూ ఉండటం గమనార్హం.వైద్యులు కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లను మానేయడంతో పాటు పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలని చెబుతున్నారు.

కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని నెలలు సమయం పట్టే అవకాశం ఉందని అందువల్ల ప్రజలు అప్పటివరకు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube