దారుణం : సిజేరియన్ చేసి శిశువు తలను గర్భంలోనే ఉంచేసిన వైద్యులు... చివరికి

ప్రస్తుత కాలంలో కొందరు వైద్యులు నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు బలవుతున్నారు.తాజాగా ఓ మహిళకి పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా సిజేరియన్ చేసిన వైద్యులు శిశువు మోండెం మాత్రమే బయటకు తీసి తలను గర్భవతి గర్భంలోనే వదిలేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

 Doctors News,  Pregnant Cesarean, Baby Death, Kurnool News, Health News-TeluguStop.com

వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లాలోని అగలనూరు గ్రామానికి చెందినటువంటి లక్ష్మిదేవి అనే మహిళ గర్భంతో ఉంది.అయితే ఇటీవలే మహిళకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన దగ్గరలో ఉన్నటువంటి నంద్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు.

దీంతో వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం కష్టంగా ఉందని సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు.దాంతో కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వెంటనే సిజేరియన్ ఆపరేషన్ మొదలు పెట్టి బిడ్డను బయటకు తీసే క్రమంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో శిశువు మొండెం మాత్రమే బయటికి తీయడంతో శిశువు తల గర్భంలోనే ఇరుక్కుపోయి శిశువు మృతి చెందింది.

చివరికి చేసేదేమీ లేక మొండెం వరకు బయటకు శిశువుని బయటకు తీసి తలను గర్భంలోనే వదిలేశారు.

ఆపై తమ వల్ల కాదంటూ వైద్యులు చేతులెత్తేయగా వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి గర్భవతిని తరలించారు.

అయితే గర్భవతి పరిస్థితిని అర్థం చేసుకున్న అక్కడి వైద్యులు హుటాహుటిన స్పందించడంతో లక్ష్మీదేవిని ప్రాణాలతో కాపాడగలిగారు.మరోవైపు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులపై గర్భవతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సిజేరియన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యం పాటించడంతోనే శిశువు మృతి చెందిందని వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు.మరోవైపు వైద్యాధికారుల మాత్రం లక్ష్మీదేవికి నెలలు పూర్తిగా నిండకుండానే పురిటి నొప్పులు రావడంతో ఆమెకు ఆపరేషన్ కష్టతరం అయిందని అయినప్పటికీ తాము తల్లి బిడ్డలను రక్షించేందుకు ప్రయత్నించామని కానీ కుదరకపోవడంతోనే తల్లి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కర్నూలు ఆసుపత్రికి సిఫారసు చేశామని కూడా తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube