కృష్ణా జిల్లాలో గర్భిణి పట్ల వైద్యుల నిర్లక్ష్యం..!

రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా కారణంగా సీజనల్ వ్యాధులు ఉన్న రోగులను, గర్భిణులను పట్టించుకోవడం మరిచారు.వీరిపై వైద్యులు నిర్లక్ష్యపు ధోరణి కనబరుస్తున్నారు.

 Krishna Distric, Hospital, Doctor, Pregnant-TeluguStop.com

కేవలం కరోనా నియంత్రణపైనే దృష్టి సారించిన ప్రభుత్వం సీజనల్ వ్యాధులపై, గర్భిణుల వైద్యంపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన సదుపాయాలు లేక, వైద్యులు అందుబాటులో ఉండడం లేదని సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఆస్పత్రిలోకి వచ్చిన వైద్యులను బీజీగా ఉన్నట్లు వ్యవహరిస్తు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.నిండు గర్భిణిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు పట్టించుకోలేదు.దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ నిర్లక్ష్యపు ఘటన చోటు చేసుకుంది.

నెలలు నిండిన గర్భిణిని కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది.ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు తమకు పట్టనట్లు వ్యవహరించడంతో ఆగ్రహానికి లోనైన కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామానికి చెందిన తిరుమల కొండ మనీషా 9 నెలల నిండు గర్భిణి.పురిటీనొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

కాగా, ఆస్పత్రి వైద్యులు కరోనా కారణంగా జాయిన్ చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు.దీంతో ఆగ్రహానికి లోనైన కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు బైఠాయించారు.

వైద్యురాలు నిర్లక్ష్యంగా మాట్లాడిందని కుటుంబ సభ్యులు వాపోయారు.వైద్యం కోసం వస్తే వైద్యం కుదరదని ఎలా పేర్కొన్నారని ప్రశ్నించారు.

ప్రభుత్వమే ఈ సమస్యపై స్పందించాలని వారు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube