వెరీ రేర్ బ్లడ్ గ్రూప్ 'EMM నెగిటివ్' గురించి విన్నారా? ఇండియాలో మొదటిసారిగా బయటపడింది!

మనలో బేసిక్ విషయాలమీద పరిజ్ఞానం వున్నవారికి బ్లడ్ గ్రూప్స్ గురించి తెలిసే ఉంటుంది.మానన శరీరంలో అన్నింటికన్నా ప్రధానమైనది రక్తం.

 Doctors Found Rare Emm Negative Blood Group In Gujarat Man-TeluguStop.com

ఊపిరితిత్తులోని గాలి నుంచి ఆక్సిజన్‌ను సేకరించి.శరీరంలోని అన్ని కణాలకు అందించడమే రక్తం యెక్క ప్రధాన కర్తవ్యం.

అంతేకాకుండా శరీరంలో ఉత్పత్తైన కార్భన్ డయాక్సైడ్‌ను అదే కణాల నుంచి పూర్తిగా తొలగించి వేస్తుంది.ఇక మానవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే 5 లీటర్ల రక్తం వరకు అవసరం ఉంటుంది.

దానికన్నా తక్కువ ఉన్నట్టయితే దాన్ని రక్తహీనతగా పరిగణిస్తారు.మనుషుల్లో వివిధ రకాల రక్త సమూహాలను బట్టి A, B, AB, O పాజిటివ్.

అలాగే నెగెటివ్ గ్రూప్స్ గా వర్గీకరించబడ్డాయి.

అయితే ఇవేవీ కాకుండా, మనకు తెలియని.

అతికొద్దిమందికి మాత్రమే తెలిసిన ఇంకో రేర్ బ్లడ్ గ్రూప్ ఉంది.అదే EMM Blood Group.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును భారత్‌లో పరిశోధకులు కనుగొనటం జరిగింది.గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌ కోట్‌కు చెందిని 65 ఏళ్ల వ్యక్తిలో “EMM నెగిటివ్” చెందిన రక్తపు గ్రూపును వైద్యులు తాజాగా కనుగొన్నారు.

ఇలాంటి బ్లడ్ గ్రూపు ప్రపంచం మొత్తంలో కేవలం 10 మందికి మాత్రమే కలదు.అలాంటి రక్తపు గ్రూపును కలిగిన పదో వ్యక్తిగా గుజరాత్ వ్యక్తి రికార్డ్ సృష్టించాడు.

భారత్‌లో ఈ బ్లడ్ గ్రూపు ఈయనకు మాత్రమే ఉంది.

Telugu Ahmedabad, Doctors, Emm, Gujarat, Indian, Rare, Rare Emm-Latest News - Te

వివరాల్లోకి వెళితే, సదరు వ్యక్తి గుండెపోటుతో అహ్మదాబాద్ ఆస్పత్రిలో చేరాడు.ఈ క్రమంలో అతనికి శస్త్రచికిత్స నిమిత్తం బ్లడ్ అవసరం ఏర్పడింది.దాంతో అతని బ్లడ్ ను పరీక్షలకు పంపించారు.

అయితే అహ్మదాబాద్ లోని ప్రథమ్ లాబోరేటరీ ఆయన బ్లడ్ గ్రూపు ఏంటో కనుక్కోలేకపోయింది.తరువాత ఈ బ్లడ్ శాంపిళ్లను సూరత్ లోని రక్తదాన కేంద్రానికి పంపారు.

అక్కడ కూడా ఈ బ్లడ్ గ్రూపు మ్యాచ్ కాలేదు.దీంతో సదరు వ్యక్తి బ్లడ్ గ్రూపుతో పాటు అతని కుటుంబ సభ్యుల రక్త నమూనాలను అమెరికా పంపించారు.

దాంతో EMM నెగిటివ్ బ్లడ్ గ్రూపు అని తేలింది.దురదృష్టకరం ఏమంటే, EMM నెటిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ఎవరికి రక్తాన్ని దానం చేయలేరు, ఇతరల నుంచి తీసుకోలేరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube