ప్రెగ్నెంట్ మహిళకు ఆపరేషన్ చేస్తూ.. డాక్టర్ ఎలాంటి పని చేసాడో తెలుసా.? ఇలాంటి వారిని ఏం చెయ్యాలి.?  

Doctor Selfie In Koraput Makes Viral In Social Media-

సెల్ఫీ మోజులో పడి పేషెంట్ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొందరు డాక్టర్లు.ఒక వైపు మహిళ ప్రసవ వేదనతో బాధ పడుతుంటే బాధ్యత మరచిన డాక్టర్లు సెల్ఫీ తీసుకుంటూ.ఆ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.ఈ దుర్ఘటన ఒరిస్సా లో చోటుచేసుకుంది.వివరాల లోకి వెళ్తే…

Doctor Selfie In Koraput Makes Viral In Social Media--Doctor Selfie In Koraput Makes Viral Social Media-

కోరాపుట్ జిల్లా ఆసుప్రతిలో ఓ గర్భిణీ మహిళకు డాక్టర్ల బృందం ఆపరేషన్ చేస్తున్న సమయంలో మరో డాక్టర్ తన మొబైల్‌తో సెల్ఫీ తీసుకున్నారు.తర్వాత ఆ ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

దీంతో ఆ డాక్టర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పలు విమర్శలు రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సూపరింటెండెంట్‌ను కోరారు.విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.