విడ్డూరం : పురుషులకు ప్రెగ్నెన్సీ టెస్టు రాసిన డాక్టర్‌, డబ్బు కోసం

ఈ మద్య కాలంలో ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ వైధ్యులు రోగుల నుండి దోచేసుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.చాలా మంది డాక్టర్లు ఏదైనా చిన్న జబ్బు అంటూ వెళ్లినప్పుడు టెస్టుల రూపంలో వేలకు వేల రూపాయలు గుంజేస్తున్నారు.

 Doctor Prescribespregnancytest For Men In Jarkhand-TeluguStop.com

అన్ని టెస్టులు చేయించి అంతా బాగానే ఉందని అంటున్నారు.జ్వరం అంటూ వెళ్లిన రోగులకు డెంగ్యూ, మలేరియా టెస్టులు చేస్తే సరిపోతుంది.

కాని ఇంకా అవసరం లేని టెస్టులు ఎన్నో చేయిస్తూ డబ్బులు ఖర్చు చేయిస్తూ ఉంటారు.

డాక్టర్లకు టెస్టుల ద్వారా మరియు మెడిషన్స్‌ ద్వారా ఎక్కువ కమీషన్‌ వస్తుందని కొందరు అంటూ ఉంటారు.

అందుకే వారు ఇలాంటి పనులు చేస్తుంటారని చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు.తాజాగా జార్ఖండ్‌లో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.ప్రస్తుతం ఆ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో పాటు, డాక్టర్ల విషయమై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.డాక్టర్లు రోగులకు రాస్తున్న టెస్టుల విషయంలో సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.జార్ఖండ్‌లోని చాత్ర జిల్లాలో సిమరాయ్‌లోని ఒక హాస్పిటల్‌కు గోపాల్‌ మరియు కామేశ్వర్‌ అనే ఇద్దరు వ్యక్తులు కడుపు నొప్పితో వెళ్లారు.రోగులను పరిశీలించిన వైధ్యుడు మహేష్‌ వారికి కొన్ని టెస్టులు రాశాడు.ఆ టెస్టులు చేయించుకున్న తర్వాత వారిద్దరు కూడా ఎలాంటి సమస్య లేదని, అజీర్తి కారణంగా కడుపు నొప్పితో బాధ పడ్డారని, ట్యాబ్లెట్స్‌ వేసుకుంటే సెట్‌ అవుతుందని డాక్టర్‌ మహేష్‌ చెప్పి పంపించాడు.

Telugu Jarkhand, Telugu Ups-

  కడుపు నొప్పితో బాధపడుతు డాక్టర్‌ వద్దకు వెళ్లిన గోపాల్‌ మరియు కామేశ్వర్‌లకు డాక్టర్‌ మహేష్‌ ప్రెగ్నెన్సీ టెస్టులు చేయించాడట.డాక్టర్‌ ప్రెగ్నెన్సీ టెస్టు రాయడంతో వారంతా కూడా అవాక్కయ్యారు.మగవాళ్లకు ప్రెగ్నెన్సీ టెస్టు ఏంటీ అంటూ ఈ విషయం ఆ నోట ఈనోట పడి వైరల్‌ అయ్యింది.విషయం డాక్టర్‌ వద్దకు వెళ్లడంతో ఆయన అసలు విషయంపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చాడు.

Telugu Jarkhand, Telugu Ups-

  తన గురించి వారిద్దరు చేస్తున్న ప్రచారంను కొట్టి పారేశాడు.అసలు నేను ప్రెగ్నెన్సీ టెస్టు చేయించుకోవాల్సిందిగా రాయలేదు.ఆ టెస్టుల చిట్టీపై చూస్తే క్లారిటీగా ఉంటుంది.నన్ను బ్లేమ్‌ చేసేందుకు కొందరు ఇలాంటివి పుట్టిస్తున్నారంటూ డాక్టర్‌ మహేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ మహేష్‌ హెచ్చరిస్తున్నాడు.మరి ఆ డాక్టర్‌ ప్రెగ్నెన్సీ టెస్టు రాశాడా లేదా అనేది తెలియాలంటే వారి వద్ద ఉన్న డాక్టర్‌ చిట్టీలు చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube