ఇంట్లోనే ఉంటూ కరోనాని జయించిన తెలుగు ఎన్నారై దంపతులు..!!!

ప్రపంచ వ్యాప్తంగా కరోన భాదితులు రోజు రోజుకి ఎక్కువై పోతున్నారు.ఇప్పటి వరకూ కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య లక్ష పైమాటే.

 London, Telugu Nri, Dr. Nimmagadda Sesha Giri, Corona Virus, Knee Pains, Fever,-TeluguStop.com

ఇక పాజిటివ్ కేసుల సంఖ్య లక్షల్లోనే ఉంది.ఏ వ్యక్తికైనా కరోనా సోకిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కి తీసుకు వెళ్తున్నారు వారికి వైద్య పరీక్షలు అన్నీ చేసి కొన్ని రోజులు ట్రీట్మెంట్ తరువాత నెగిటివ్ తేలితేగాని ఇంటికి పంపడం లేదు.

కానీ తమ ఇళ్ళ వద్దే ఉంటూ వ్యాధి చికిత్స చేసుకునే వారు ఇప్పటి వరకూ ఎవరూ లేరు అయితే.

ఈ రికార్డ్ ని లండన్ లో ఎన్నారై దంపతులు బ్రేక్ చేశారు.

తమకి సోకిన కరోనా ని ఇంట్లోనే ఉంటూ తగ్గించుకో వడంతో పాటు వారు ఎలా కరోనాపై విజయం సాధించారు.ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయాల్ని వారి వెల్లడించారు.

దాంతో ఇప్పుడు ఈ ఎన్నారై దంపతులు హాట్ టాపిక్ అయ్యారు.లండన్ లో ఉంటున్న డాక్టర్ నిమ్మగడ్డ శేష గిరి, హేమా దంపతులు ఎన్నో ఏళ్ళ క్రితమే లండన్ వెళ్లి స్థిరపడ్డారు.

ఊహించని విధంగా ఆయన సతీమణికి కరోనా పాజిటివ్ ఉందని తెలియడంతో తాము హోమ్ క్వారంటైన్ లోనే ఉంది చికిత్స తీసుకుంటామని ప్రభుత్వానికి తెలిపారు.

Telugu Problem, Corona, Cough, Drnimmagadda, Knee, London, Telugu Nri-

తన భార్యకి కరోనా సోకిందని తెలిసిన వెంటనే ఆయన పిల్లలని వేరే గదిలో ఉండమని చెప్పారు వైద్యం చేస్తున్న క్రమంలో శేషగిరి రావుకి కూడా కరోనా సోకింది.తన భార్యకి ముందుగా ఒళ్ళు నెప్పులు రావడం, కాళ్ళు లాగడం, జ్వరం రావడం జరిగింది.అయితే సహజంగానే ఆయన సైకాలజీ డాక్టర్ కావడంతో మానసికంగా ఇద్దరూ ధైర్యంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.

తమ సన్నిహితులతో తరుచు మాట్లాడుతూ ఎంతో మనో ధైర్యాని నింపుకునే వారు.ఈ క్రమంలోనే దగ్గు కి దగ్గు మంది జ్వరానికి మందులు వాడేవారు.

అంతేకాదు ప్రతీ రోజు రెండు సార్లు ఉప్పు నీటిని రెండు సార్లు పుక్కిలించి ఊసేవారు.పసుపు, అల్లం మిరియాలు తో చేసిన కషాయాన్ని చేసుకుని త్రాగేవారు.

ఒక లీటరు నీటిలో నిమ్మకాయ పిండుకుని రెండుకి రెండు పూటలా తాగేవారు.విటమిన్లు, జింక్ , ఇమ్మునిటీ పెంచే మాత్రలు వాడేవారు.

కరోనా శరీరాన్ని బలహీనం చేస్తుంది కాబట్టి అన్నం సహించక పోయినా బలవంతంగా అయినా తినేవారు.చారు కాచుకుని అందులో వెల్లుల్లి, జీలకర్ర వేసుకుని త్రాగేవారు.

ఇలా చేస్తూ ఉన్న క్రమంలోనే దగ్గు విపరీతంగా వచ్చేది అయినా తమ క్రమ నియమాన్ని మరిచిపోకుండా అన్ని రోజువారి పద్దతులు పాటించే వారు 11 వ రోజులో దగ్గు తగ్గుతూ వచ్చింది 14 వ రోజున పూర్తిగా దగ్గు తగ్గిపోయింది.అయితే ఇలాంటి పరిస్థితులలో ఊపిరి తీసుకోలేని పరిస్థితి వస్తే తప్పకుండా డాక్టర్ ని సంప్రదించాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube