ఒక డాక్టర్ కిరాతకం.. కరోనా పేషెంట్లను దారుణంగా.. ??

Doctor Murder Covid Patients In Italy

ఈ లోకంలో మనిషి, దేవుణ్ని తర్వాత అంతలా నమ్మేది డాక్టర్స్‌ను మాత్రమే.ఎందుకంటే దేవుడు జన్మనిస్తే, డాక్టర్ పునర్జన్మనిస్తాడని అనుకుంటారు కాబట్టి.

 Doctor Murder Covid Patients In Italy-TeluguStop.com

అందుకే కరోనా సమయంలో సేవలందించిన డాక్టర్స్‌ను ఎందరో అభిమానించారు.కానీ ఇదే కరోనా సమయంలో ఒక డాక్టర్ చేసిన పని తెలిస్తే అతన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది.

ఇంతకు ఆ డాక్టర్ చేసిన పని ఏంటంటే తాను పనిచేసే హాస్పిటల్ లో బెడ్లు ఖాళీ చేయటానికి కరోనా పేషెంట్ల ప్రాణాలు తీసాడట.ఇక ఈ ఘటన ఇటలీ లాంబర్డిలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్‌ ఎమర్జెన్సీ వార్డులో జరిగిందట.

 Doctor Murder Covid Patients In Italy-ఒక డాక్టర్ కిరాతకం.. కరోనా పేషెంట్లను దారుణంగా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక్కడ పనిచేస్తున్న కార్లొ మోస్కా అనే డాక్టర్ ఎమర్జెన్సీ వార్డు కు ఇంచార్జిగా పని చేస్తున్నాడట.అయితే ఇటలీలో కరోనా కేసులు పెరగటంతో హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండి పోయాయి.

ఈ క్రమంలో ఇతనున్న హస్పిటల్లో కూడా బెడ్లు అన్నీ ఫుల్ అయిపోయాయట.దీంతో డాక్టర్కార్లొ మోస్కా కొందరు కరోనా పేషెంట్లను చంపేయాలని నిర్ణయించుకుని ఈ విషయాన్ని నర్సులకు చాటింగ్ లో చెప్పాడట.దానికి ఆ నర్సులు ఒప్పుకోక పోవడంతో, ఇతనొక్కడే 61 ఏళ్ల నటాలే బస్సీ, 80 ఏళ్ల ఏంజెలో పలెట్టి అనే కరోనా పేషెంట్లను చంపాడట.ఇక గత మార్చిలో జరిగిన ఈ దారుణ ఘటన బయటకు రావడంతో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారట.

కాగా ఇదే హాస్పిటల్ లో మరణించిన మరో ముగ్గురి చావుకు కూడా ఈ డాక్టరే కారణమా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారట.

#Italiy #Carlo Mosca #Lombardy #COVID #Beds

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube