వైరస్ వైవిధ్యం.. ఒక్కొక్కరిలో ఒక్కోలా, మిస్టరీని చేధిస్తే టీకా తథ్యం: భారత సంతతి శాస్త్రవేత్త

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విధ్వంసం మొదలై ఏడు నెలలు పూర్తి కావొస్తోంది.కానీ నేటి వరకు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టలేకపోవడం వైద్య రంగానికే సవాల్‌గా మారింది.

 Coronavirus : 40% Cases Have No Symptoms May Be Key To Ending Pandemic Says Repo-TeluguStop.com

ఇప్పటి వరకు సుమారు 2 కోట్ల మంది కోవిడ్ బారినపడగా.వీరిలో 7.26 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.అయితే కరోనా లక్షణాలు ఒక్కొక్కరిలో.

ఒక్కో దేశంలో, ఒక్కో విధంగా కనిపిస్తున్నాయి.కొంతమందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా నిర్థారణ అవుతుండగా.

మరికొందరిలో మాత్రం స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి.

దాదాపు 40 శాతం కరోనా రోగులకు లక్షణాలు కనిపించడం లేదని అమెరికాలో భారత సంతతికి చెందిన పరిశోధకురాలు డాక్టర్ మోనికా గాంధీ అధ్యయనంలో తేలింది.

ఈమె కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధుల నిపుణురాలిగా పనిచేస్తున్నారు.బోస్టన్ నిరాశ్రయుల ఆశ్రయంలో దాదాపు 147 మందికి కరోనా సోకితే.88 శాతం మందికి లక్షణాలే లేవని తమ పరిశోధనలో తేలిందని మోనికా అన్నారు.ఆర్క్‌లోని స్ప్రింగ్‌డేల్‌లోని టైనస్ ఫుడ్స్ పౌల్ట్రీ ప్లాంట్‌లో 481 మంది కరోనా బారినపడితే.95 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని తేలిందని ఆమె చెప్పారు.అర్కాన్సాస్, నార్త్ కరోలినా, ఒహియో, వర్జీనియాలోని జైళ్లలోని 3,277 ఖైదీలు కోవిడ్ బారినపడగా.96 శాతం మందిలో ఒక్క లక్షణం కూడా కనిపించలేదని మోనికా తెలిపారు.

Telugu Corona Pandemic, Coronavirus, Symptoms-

తీవ్ర లక్షణాలు కనిపించిన వారితో కలిసి ఉన్నవారిలో కొంతమందికి కోవిడ్ సోకలేదని, దీనికి గల కారణాలు అంతుచిక్కడం లేదన్నారు.ఈ మిస్టరీని చేధిస్తే వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయొవచ్చని గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.ఎటువంటి లక్షణాలు లేని పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదుకావడం శుభపరిణామని, ఇది వ్యక్తి, సమాజానికి మంచి విషయమని ఆమె హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు మాస్క్‌లు ధరించడం వల్ల వైరస్‌ను తగినంతగా ఫిల్టర్ చేయడంతో వారికి తేలికపాటి లక్షణాలు, అసలు లక్షణాలు ఉండటం లేదని ఆమె తెలిపారు.మాస్కులు పెట్టుకున్నప్పుడు, పెట్టుకోనప్పుడు వైరస్ ప్యాటర్న్ ఎలా ఉందో తాము అధ్యయనం చేసినట్లు మోనికా చెప్పారు.

మాస్కుల వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో కేసులు వచ్చినా మరణాల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉందని ఆమె పేర్కొన్నారు.దీనిని బట్టి మాస్కు పెట్టుకుంటే వైరస్ సోకినా.

శరీరంలో వైరల్ లోడు తక్కువగా ఉంటున్నట్లు తేలిందని మోనికా అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube