చైనాలో కరోనా గురించి మాట్లాడిన మరో డాక్టర్ మిస్సింగ్  

Doctor Missing Coronavirus China - Telugu Bio Weapon, Corona Virus, Covid-19, One More Disappeared Doctor Who Warned About The Virus

చైనా

లోని వూహాన్ నగరంలో పుట్టిన

కరోనా వైరస్

ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించింది.ఇక చైనా కంటే దారుణమైన స్థితిలో ఇప్పుడు అమెరికా, స్పెయిన్, ఇటలీ కరోనా వైరస్ బారిన పడ్డాయి.

 Doctor Missing Coronavirus China

అయితే అంతు చిక్కని విధంగా కరోనా వైరస్ పుట్టిన చైనాలో మాత్రం ఆ సిటీ దాటి ఇతర రాష్ట్రాలలో కాని, ప్రాంతాలలో కాని కరోనా కేసులు పెద్దగా నమోదు కాలేదు.ఇప్పుడు ఇక్కడే ప్రపంచం మొత్తం చైనా వైపు అనుమానంగా చూస్తుంది.

కరోనా వైరస్ అనేది చైనా వదిలిన జీవాయుధంగా నమ్ముతున్నాయి.పూర్తి స్థాయి ఆధారాలు లేకపోయినా అక్కడ జరిగిన కొన్ని సంఘటలు చైనా మీద వినిపిస్తున్న విమర్శలు వాస్తవమని నమ్మే విధంగా చేస్తున్నాయి.

చైనాలో కరోనా గురించి మాట్లాడిన మరో డాక్టర్ మిస్సింగ్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ వైరస్ గురించి తొలుత నోరిప్పిన డాక్టర్

లీ వెన్ లింగ్

పై చైనా ప్రభుత్వం కఠిన చర్యలే తీసుకుంది.కరోనా గురించి బయటకు చెప్పడంతో అతనిని జైల్లో కూడా పెట్టింది.

చివరికి అతను

కరోనా వైరస్

సోకి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.అతను చనిపోయినంత వరకు ఆ విషయాన్ని చైనా బయటకి చెప్పలేదు.

అయితే ఇప్పుడు చైనా పాల్పడిన మరో దురాగతం ఇప్పుడు బయటకు వచ్చింది.వూహాన్ సెంట్రల్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ విభాగానికి చీఫ్ గా వ్యవహరిస్తున్న మహిళా వైద్యురాలు అయి ఫెన్ కనిపించకుండా పోయారు.

కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ గురించి అంతర్జాతీయ న్యూస్ చానల్ కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది.ఈ ఇంటర్వ్యూ ఇచ్చిందనే కారణం చూపించి చైనా ప్రభుత్వం ఆమెని ఉద్యోగంలోంచి తొలగించింది.

తరువాత కొద్ది రోజులకే ఆమె కనిపించకుండా పోయింది.దీంతో చైనా ఏదో రహస్యం దాస్తుందని, కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియకుండా ఉంచే ప్రయత్నం చేస్తుందని అన్ని దేశాలు నమ్ముతున్నాయి.

ఇక కరోనా వైరస్ చైనా వదిలిన

జీవాయుధం

అని నిరూపించడానికి కూడా ప్రయోగాలు చేస్తున్నారు.అది వాస్తవమే అని తేలితే మాత్రం ప్రపంచ దేశాల ముందు చైనా దోషిగా నిలబడక తప్పని పరిస్థితి.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

One More Disappeared Doctor Who Warned About The Virus Related Telugu News,Photos/Pics,Images..