రేపే ఎన్నికల ఫలితాలు...మరింత క్షీణించిన లాలూ ఆరోగ్యం

ఒకపక్క బీహార్ ఎన్నికల పై ఉత్కంఠ నెలకొన్న ఈ సమయంలో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తుంది.బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో మహాగడ్బంధన్‌కు మంచి ఛాన్స్‌ ఉందని ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పినప్పటికీ రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మాత్రం ఇంకా టెన్షన్‌ పడుతున్నట్లు అర్ధం అవుతుంది.

 Lalu Yadav Not Well Would Go For Dialysis If Condition Worsens Further Says Doct-TeluguStop.com

ఇటీవల జరిగిన బీహార్ లో మూడు దశలుగా ఎన్నికలు జరుగగా, రేపే ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.రేపే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో లాలూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు డాక్టర్లు అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రస్తుతం డయాలసిస్‌ కొనసాగుతున్నదని వివరించారు.దాణా స్కామ్‌ కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 2017 నుంచి జైలులోనే ఉంటున్న సంగతి తెలిసిందే.

అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.లాలుకు కిడ్నీ సమస్యలు కూడా ఉండడం తో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తుంది.

అయితే ఇప్పటివరకు ఆయనకు డయాలసిస్‌ చేయాల్సిన అవసరం రాలేదని, కాని ఇప్పుడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడం తో ఆయనకు డయాలసిస్ చేస్తున్నామని డాక్టర్లు అంటున్నారు.

Telugu Bhihar, Dialysis, Lalu Yadav, Tejaswi Yadav-Political

మరోపక్క ఈ రోజే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పుట్టిన కావడం తో ఘనంగా వేడుకలు నిర్వహించారు.బీహార్ లో ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారం లో పాల్గొని తమ పార్టీని గెలిపించాలి అంటూ కోరగా, అయితే గత నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా లాలూ ప్రసాద యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడమన్నది జరిగింది.ఆయన ఆరోగ్యం సరిగా లేనందునే ఆయన ఈ ఎన్నికల ప్రచార సమయంలో పాల్గొననట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube