కరోనా సోకిన వ్యక్తి భార్య పై డాక్టర్ అసభ్యకరంగా అక్కడ చేతులు వేస్తూ...

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విపత్కర సమయంలో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే కొందరు వైద్యులు మాత్రం కామాంధకారకంలో కూరుకుపోయి చికిత్సలు అందించాల్సిన సమయంలో మహిళా కోవిడ్ పేషెంట్లు మరియు ఇతర మహిళలతో చాలా ఆసక్తికరంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.కాగా తాజాగా ఓ మహిళ భర్తకి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేర్పించగా ఓ డాక్టర్ తన భర్త కి చికిత్స చేసే నెపంతో తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఓ మహిళ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా లైవ్ నిర్వహించి డాక్టర్ బాగోతం గురించి బయట పెట్టిన ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగుచూసింది.

 Doctor Harassment On Corona Positive Patient Wife In Bihar-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని భాగల్పూర్ పట్టణ పరిసర ప్రాంతంలో ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.అయితే ఇటీవలే ఈ మహిళ భర్త కి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో స్థానికంగా ఉన్నటువంటి గ్లోకల్ ఆసుపత్రిలో వైద్య చికిత్సల కోసం చేర్పించింది.

దీంతో అప్పటి నుంచి తన భర్తకి కావాల్సినవి చూసుకుంటూ మహిళ కూడా అక్కడే ఉంటోంది.అయితే ఈ మహిళపై కన్నేసినటువంటి ఓ డాక్టర్ తన భర్తకి చికిత్స అందించే నెపంతో అసభ్యకరంగా సైగలు చేయడం మరియు ప్రైవేటు శరీర భాగాలను తాకడం వంటివి చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

 Doctor Harassment On Corona Positive Patient Wife In Bihar-కరోనా సోకిన వ్యక్తి భార్య పై డాక్టర్ అసభ్యకరంగా అక్కడ చేతులు వేస్తూ…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో తాజాగా బాధిత మహిళ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి డాక్టర్ యొక్క బాగోతాన్ని బయట పెట్టింది.

అంతేకాకుండా గ్లోకల్ ఆసుపత్రిలో కొందరు వైద్యులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని వాపోయింది.

దీంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సదరు వైద్యాధికారులను అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరింది.కాగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అంతేగాక వైద్యం కోసం వచ్చిన రోగి భార్యపై లైంగిక దాడికి పాల్పడిన వైద్యుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు పోలీసులు కోరుతున్నారు.

#CoronaPositive #Bihar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు