రచ్చ అవుతున్న యాడ్..ట్రంప్ ని ఇరకాటంలోకి నెట్టిన పౌసి...!!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఎంతో సమయం లేదు.అటు బిడెన్, ఇటు ట్రంప్ ఇద్దరిలో ఎవరు అధ్యక్షుడు అవుతారనే సందిగ్ధతకు తెరపడానికి ఎంతో సమయం కూడా లేదు.

 Doctor Fausi Video Wiral On Social Media About Donald Trump And Coronavirus, Ame-TeluguStop.com

ఎన్నికల ప్రచారంలో ఒకరికొకరు గట్టి పోటీనే ఇస్తున్నారు.ట్రంప్ పై ప్రయోగించడానికి బిడెన్ కు ఉన్న ఏకైక ఆయుధం కరోనా మహమ్మారి మాత్రమే అంతకు మించి ట్రంప్ ను అమెరికా ప్రజలు ఓడించే ఒక్క కారణం కూడా బిడెన్ వద్దలేదు.

అందుకే కేవలం కరోనా సాకును మాత్రం బిడెన్ వర్గం బూచిగా చూపిస్తోంది.అయితే

బిడెన్ వేస్తున్న ఎత్తుల నుంచీ తప్పించుకోవడానికి ట్రంప్ కూడా ఎత్తులకు పై ఎత్తులు బాగానే వేస్తున్నారు.

తన ఎన్నికల ప్రచారంలో కరోనాపై తాను తీసుకున్న చర్యలు అలాగే పక్క దేశాలలో కరోన ప్రభావం ఎలా ఉంది.అక్కడ ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉన్నాయో లెక్కలు కట్టిమరీ చెప్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రచారంలో అమెరికా ప్రఖ్యాత అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్.పౌసి మాట్లాడిన ఓ వీడియోని ప్రచారంలో వాడేస్తున్నారు.

ఇప్పుడు ఈ యాడ్ అమెరికా వ్యాప్తంగా రచ్చ రచ్చ అవుతోంది.

Telugu @realdonaldtrump, America, Americafinacial, Coronavirus, Fausi, Donald Tr

కరోనా విషయంలో ట్రంప్ పూర్తిగా చర్యలు తీసుకున్నారు.కరోనాని తరిమి తరిమి కొట్టారు.ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టారు.

అంటూ ఓ వీడియో వస్తుంది ఈ 30 సెకన్ల నిడివి గల వీడియోలో ఇంతకంటే ఎవరు ఏమి చేయగలరు అంటూ ట్రంప్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నట్టుగా పౌసీ మాట్లాడిన మాటలు కన్పిస్తాయి.అయితే అది ఎదో వేరే సందర్భంలో అన్న మాటలు కానీ ట్రంప్ బృందం వీడియోలను ఎడిట్ చేసి మరీ ప్రచారం లో వాడుకుంటోంది.

నేను ఏ పార్టీ అభ్యర్ధిని ఇప్పటి వరకూ మద్దతుగా మాట్లాడలేదు అంటూ కామెంట్స్ చేశారు.ఈ యాడ్ కి నాకు సంభంధం లేదు ఇది అతుకులతో పెట్టిన యాడ్ అంటూ విమర్శించారు.

పౌసీ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్ ప్రచార వ్యుహకర్త ముర్తా ఆ మాటలు పౌసీ మాట్లాడినవేనని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube