అక్క చెల్లెల్లతో డాక్టర్ బాబు భార్య అదిరిపోయే డ్యాన్స్.. వీడియో వైరల్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ తో ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. ఈ సీరియల్ లో డాక్టర్ బాబుగా మంచి సక్సెస్ అందుకున్నాడు నిరుపమ్.

 Doctor Babu Wife Manjula Paritala Dance With Sisters Video Viral Details,  Docto-TeluguStop.com

ఇక నిరుపమ్ ఎవరో కాదు అలనాటి నటుడు, డైలాగ్ రైటర్ ఓంకార్ కుమారుడే నిరుపమ్.ఇక ఈయన మరో బుల్లితెర నటి మంజుల ను పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

వీరికి అక్షర ఓంకార్ అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

బుల్లితెరపై క్యూట్ కపుల్స్ గా ఉన్న ఈ జంట.చంద్రముఖి సీరియల్ లో తొలిసారిగా కలిసి నటించారు.ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం పెరగడంతో ప్రేమగా మారిందని.

ఇక తన ప్రేమ విషయం తమ కుటుంబ సభ్యులతో చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నామని గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తెలిపారు.ఇక పెళ్లి తర్వాత కూడా మంజుల పలు సీరియల్స్ లో నటించింది.

ఇక ఈ మధ్య సీరియల్స్ కు దూరమవ్వగా అప్పుడప్పుడు బుల్లితెరలో జరిగే కొన్ని ఈవెంట్లలో, కొన్ని షోలలో పాల్గొంటుంది.కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ భాషల్లో కూడా పలు సీరియల్స్ లో నటించింది.

అక్కడ కూడా తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.తెలుగు లో చంద్రముఖి తర్వాత తరంగాలు, కాంచన గంగ, అమ్మాయి కాపురం, నీలాంబరి, చంద్రలేఖ వంటి సీరియల్స్ లో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

చాలా వరకు అన్ని ఛానల్స్ లో నటించింది మంజుల పరిటాల. కేవలం మంజుల నే కాకుండా తన చెల్లి మరిది కూడా టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు.ఇక మంజుల అందంలో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు.ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.రీల్స్ కూడా చేస్తూ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తల చెల్లి కీర్తి తో కలిసి బాగా డాన్సులు చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది.

ఇక ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్లీ సీరియల్స్ లో అడుగు పెట్టింది మంజుల.జెమిని ఛానెల్లో ప్రసారం కానున్న ‘కొంచెం కారం కొంచెం తీపి’ అనే ఓ డైలీ సీరియల్ లో నటిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియో పంచుకుంది.అందులో తాను ఏదో వేడుకకు వెళ్లినట్లు కనిపించగా వాళ్లు బాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు.

ఇక తన అక్కా చెల్లెళ్లతో మంజుల ఒక పాటకు డాన్స్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఆ వీడియోకు తెగ లైక్ లు కూడా వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube