అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్ బాబు.. ఏంటంటే?

బుల్లితెరపై పరిటాల నిరుపమ్ అంటే బహుశా చాలామందికి కొద్దిగా లేటుగా గుర్తుపడతారేమోగానీ, డాక్టర్ బాబు అంటే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయనను తొందరగా గుర్తుపట్టేస్తారు.అంతగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు పరిటాల నిరుపమ్.

 Nirupam Paritala Youtube Channel For Fans, Doctor Babu, Nirupam Paritala, Manjul-TeluguStop.com

ప్రస్తుతం పరిటాల నిరుపమ్ డాక్టర్ బాబుగా కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సీరియల్ లో అద్భుతంగా నటిస్తూ ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న కార్తీక్ పాత్ర కన్నా డాక్టర్ బాబు పాత్రలో అందరికీ పరిచయమయ్యారు.

అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇక కార్తీక్ నిజ జీవితంలో మంజుల అనే సీరియల్ ఆర్టిస్ట్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ ద్వారా పరిచయమైన ఈ జంట నిజ జీవితంలో కూడా జంటగా మారి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక కార్తీకదీపం సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న డాక్టర్ బాబు గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

డాక్టర్ బాబు రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?అతనికి ఆ వైజాగ్ లో ఉన్న ఆస్తి విలువలు ఎంతో తెలుసా? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ విధంగా తన కుటుంబం పై తనపై వస్తున్న వార్తలను ఖండిస్తూ నిజానిజాలు తన అభిమానులకు తెలిసేలా చేయాలని నిరుపమ్ దంపతులు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే డాక్టర్ బాబు అభిమానులకు శుభవార్తను చెబుతూ.సోషల్ మీడియా వేదికగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేరుగా తనకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే వీరిద్దరూ “మంజులా నిరుపమ్” అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు దగ్గర కాబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా “అలా మొదలైంది.”మా ఛానల్ ఇంట్రో అనే విషయాన్ని తెలియజేస్తూ షేర్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube