డాక్టర్ బాబు మోనిత రొమాన్స్.. యాంకర్ రవి నాటు కామెంట్లు

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల, మోనిత అలియాస్ శోభ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.ఇటీవలే ఈ సీరియల్ లో వీరి పాత్రలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి.

 Doctor Babu And Monita Romance Anchor Ravi Funny Comment, Doctor Babu, Monita, H-TeluguStop.com

వీరిద్దరూ ఈ సీరియల్ లో తమ పాత్రలతో అద్భుతంగా మెప్పించారు.మొత్తానికి ఈ సీరియల్ ద్వారా వంటలక్క, మోనిత, డాక్టర్ బాబు స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు.

ఇక వీరు సీరియల్ లో ఉన్నంత వరకే తమ పాత్రలలో లీనమవుతారు కానీ బయట మాత్రం తెగ రొమాన్స్, అల్లర్లు చేస్తూ కనిపిస్తుంటారు.

సెట్ లో ఖాళీ సమయాల్లో ఫన్నీ వీడియోలు చేస్తూ తమ అభిమానులను ఆకట్టుకుంటారు.

ఇక మోనిత సీరియల్ లో డాక్టర్ బాబు పై చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు.ఆయనను దక్కించుకునేందుకు ఆమె చేసే ప్రయత్నాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సీరియల్ లో ఆయనతో ఉండకపోయినా.

బయట మాత్రం ఏదైనా ఈవెంట్స్ సందర్భాల్లో తానే డాక్టర్ బాబు కు జోడిగా వచ్చి సందడి చేస్తుంది.

నిజానికి ఆ సమయంలో వంటలక్క డాక్టర్ బాబుకు దూరంగా ఉంటుందనే చెప్పాలి.అంటే దీన్నిబట్టి చూస్తే కార్తీకదీపంలో మోనిత డాక్టర్ బాబు కే సొంతం అన్నట్లుగా చూపిస్తారు.

అలా బుల్లితెరపై ప్రసారమయ్యే ఏ ఈవెంట్ లో అయినా కూడా వీరిద్దరూ జంటగా వచ్చి ప్రేక్షకుల దృష్టిలో పడతారు.గతంలో స్టార్ మా లో ప్రసారమైన బుల్లితెర సెలబ్రెటీల ఓ ఈవెంట్ లో కూడా మోనిత, డాక్టర్ బాబు వచ్చి సందడి చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా మరో ఈవెంట్ కు వచ్చి బాగా రచ్చరచ్చ చేశారు.

Telugu Anchor Ravi, Babu, Holi Show, Monita-Movie

హోలీ సందర్భంగా స్టార్ మా ‘ఈ హోలీకి తగ్గేదేలే‘ అంటూ ఒక ఈవెంట్ ను నిర్వహించారు.అందులో బుల్లితెర సెలబ్రెటీలతో పాటు వాళ్ల ఫ్యామిలీలు కూడా వచ్చి బాగా సందడి చేశాయి.ఈ ఈవెంట్ లో డాక్టర్ బాబు, మోనిత మరోసారి జంటగా కనిపించారు.

ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు.

ఈ షోలో రవి, రష్మీ యాంకర్ గా చేశారు.

ఇక రవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.నోటికి వచ్చిన పదాలతో అందరి దృష్టిలో పడుతుంటాడు.

ఇక షోలో భాగంగా రసవత్తరమైన ఫోజులను అక్కడ కొన్ని జంటల నుంచి రష్మి కోరుకుంది.దీంతో అక్కడున్న జంటల్లో మోనిత, డాక్టర్ బాబు కూడా ఉండగా.

Telugu Anchor Ravi, Babu, Holi Show, Monita-Movie

డాక్టర్ బాబు మోనితను పైకి ఎత్తుకొని రొమాంటిక్ గా ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ కనిపించారు.ఇక వాళ్ల దగ్గరికి రవి వెళ్లి మీకు ఎలా అనిపిస్తుంది అనటంతో.వెంటనే డాక్టర్ బాబు మీరు టైం గురించి చెప్పలేదు.ఎత్తుకున్నాక టైం గురించి చెబుతున్నారు అంటూ మోనితను బరువుగా ఫీల్ అయ్యాడు.

ఇక వాళ్ళు అలా ఎత్తుకోలేదు కదా అనడంతో మీ దూల కొద్దీ మీరు ఎత్తుకున్నారు అంటూ నాటు కామెంట్లు చేశాడు రవి.మొత్తానికి అక్కడ కాసేపు సందడి సందడి గా అనిపించింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube