మీ పేరు A అక్షరంతో మొదలు అవుతుందా మీ జీవితంలో జరిగే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి   Do Your Name Starts With Letter ‘A’     2018-02-18   21:16:06  IST  Raghu V

A అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఆకర్షణీయంగా ఉన్నవారంటే చాలా ఇష్టం. వీరు వారితో మాట్లాడటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి దైర్యం చాలా తక్కువ. అయితే అవసరమైనప్పుడు చూపించే ధైర్యాన్ని చుసి ఆశ్చర్యపోవాల్సిందే. వీరు నచ్చిన పని చేయటానికి ఏమి చేయటానికి అయినా రెడీగా ఉంటారు.

వీరు నిర్ణయాలను తీసుకొనే సమయంలో ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. కష్టమైన,నష్టమైనా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. కొంచెం కఠినమైన మరియు కష్టమైన ఏదైనా విషయాన్నీ చెప్పినప్పుడు అర్ధం చేసుకుంటారు. మాటలను తారుమారు చేసి చెప్పటం లేదా సైగల ద్వారా చెప్పితే అసలు ఇష్టపడరు.


పార్టీలు,ఫంక్షన్స్ అంటే విపరీతమైన మోజు ఉంటుంది. కానీ పార్టీలకు వెళ్ళరు. అందరితో కలిసి ఉండాలని కలిసి గడపాలని భావిస్తారు. వీరికి విపరీతమైన కోపం ఉంటుంది. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ చేయటానికి వెనకడుగు వేయరు. వీరికి దయ,జాలి గుణాలు ఎక్కువగా ఉండుట వలన వీరిని ఎదుటివారు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు.

ఏదైనా పని చేయాలనీ అనుకున్నప్పుడు మొండి పట్టుదలతో చేస్తారు. పని అయ్యేవరకు నిద్రపోరు. ఈ మొండి పట్టుదల కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మొండి పట్టుదల తగ్గించుకుంటే మంచిది. వీరు సంపాదించిన దానిలో కొంత దాన ధర్మాలకు ఖర్చు చేస్తూ ఉంటారు. సంఘంలో మంచి గుర్తింపు,పేరు వస్తాయి. వీరి ఆలోచన సరళి బాగుంటుంది. ఈ గుణాలు మనకు పేరు పెట్టినప్పుడు రావు. మన పేరును పిలుస్తున్న కొద్దీ ఈ లక్షణాలు కనపడుతూ ఉంటాయి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.