మీకు అంతరిక్ష ప్రయాణం చేయాలని ఉందా... ఖర్చు ఎంతంటే?

కొన్నేళ్ల క్రితం అంతరిక్షం గురించి తెలుసుకోవాలంటే శాస్త్రవేత్తలు చాలా శ్రమించాల్సి వచ్చేది.ఏ ఒక్క చిన్న విషయం అంతరిక్షం గురించి కొత్తగా తెలిసినా దాన్ని అతి పెద్ద విజయంగా పరిగనించే వారు.

 Do You Want To Travel By Space  How Much Does It Cost, Viral News, Jef Bezos-TeluguStop.com

దానికి గల కారణం అప్పుడు అంతగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు కాబట్టి అప్పుడు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానంతో మాత్రమే తమ కున్న పరిజ్ఞానాన్ని జోడించి కొత్త కొత్త ప్రయోగాలు నిర్వహించే వారు.కాని ఇప్పుడు పరిస్థితి మొత్తం భిన్నంగా తయారయింది.

ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ అంతరిక్షం గురించి అలవోకగా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది.అయితే ఒకప్పుడు అంతరిక్ష యాణం చేయాలంటే వ్యోమగాములు తప్ప వేరే వారికి సాధ్యమయ్యే పరిస్థితి ఉండేది కాదు.

కాని ఇప్పుడు ఏకంగా సరదాగా ప్రయాణం చేయడానికి అంతరిక్షం కు వెళ్ళడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

సరదాకు అంతరిక్షం చేయడమేంటని ఆశ్చర్య పోతున్నారా.

అవును మీరు చూసింది నిజమే.ఈ అంతరిక్ష ప్రయాణానికి వ్యూహ రచన చేసింది అమెజాన్ అధ్యక్షుడు జెఫ్ బెజోస్.

జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజన్ కంపెనీ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.జులై 20న న్యూ షెపర్డ్ రాకెట్ లో కొంత మంది కంపెనీ సిబ్బంది వెల్లనున్నారు.

అయితే అందులో ఓ సీటు కోసం ఆన్ లైన్ లో వేలానికి ఉంచారు.ఇక అంతరిక్షానికి వెళ్లాలనుకునే వారు ఆ సీటు వేలంలో పాల్గొనవలసి ఉంటుంది.

అయితే వేలంలో పలికిన ధరనే సీటు ఖరీదుగా నిర్ణయించునున్నారు.ఏది ఏమైనా కొత్త శకానికి జెఫ్ బెజోస్ శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube