మారుతారా మార్చమంటారా? తమ్ముళ్లకు బాబు వార్నింగ్ 

రాబోయే సార్వత్రిక ఎన్నికలపై టిడిపి అధినేత చంద్రబాబు చాలా సీరియస్ గానే దృష్టి పెట్టారు.ముఖ్యంగా తమ ప్రధాన ప్రత్యర్ధి వైసిపి దూకుడుగా ముందుకు వెళ్లడంతో పాటు, ప్రజా సంక్షేమ పథకాలు , నిర్ణయాల ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండడం , ఎన్నికల సమయం నాటికి మరింతగా ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో, చంద్రబాబు కూడా అలెర్ట్ అవుతున్నారు.

 Do You Want To Change? Babu's Warning To Younger Brothers, Chandrababu, Nara Lok-TeluguStop.com

పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అలాగే నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేపడుతూ, పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయంపై ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు.

గత కొద్ది రోజులుగా జిల్లాల వారీగా, నియోజకవర్గాల సమీక్షలు చేపడుతున్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జీలకు చంద్రబాబు అనేక సూచనలు చేస్తూ పార్టీ పరిస్థితి బలహీనంగా ఉన్న చోట హెచ్చరికలు చేస్తున్నారు.

ఈసారి ఎన్నికల్లో గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకమని, ఎవరు అలసత్వం వహించవద్దని , రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించిన ఎన్నికల సమయం నాటికి వారి పనితీరు బాగోకపోతే మార్చేస్తామని, క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజాబలం పెంచుకోవాలని బాబు అనేక సూచనలు ఇస్తున్నారు.ఈ సందర్భంగా చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జీలు తమకే టికెట్ ఖరారు అయిందంటూ ప్రచారం చేసుకోవడంపై బాబు సీరియస్ అయ్యారు.

పనితీరు ఆధారంగానే టికెట్ కేటాయిస్తామని , ఎవరికివారు తమకే టిక్కెట్ అని ప్రచారం చేసుకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ బాబు వార్నింగ్ ఇస్తున్నారు.పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టాల్సిందేనని, లేకపోతే ప్రత్యామ్నయం చూసుకుంటామంటూ ఇన్చార్జిలకు వార్నింగ్ ఇస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap Tdp, Chandrababu, Lokesh, Tdp Incharges, Ysrcp-Political

ఇప్పటి వరకు 59 మంది నియోజకవర్గ ఇన్చార్జిలతో చంద్రబాబు సమీక్షలు చేశారు.ఈ సమీక్షలో క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సూచనలు, ఫిర్యాదులను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.అలాగే సర్వే రిపోర్టులను బయటపెట్టి ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నాం అనేది నియోజకవర్గాల వారీగా ప్రకటిస్తున్నారు.తమ పనితీరును మెరుగుపరుచుకోకుండా , జనాల్లోకి వెళ్ళకుండా రాబోయే ఎన్నికల్లో టికెట్ తమదేనని, తామే గెలుస్తామని ధీమా తో ఉన్నవారు తమ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే వారిని మార్చేందుకు కూడా వెనకాడబోమని బాబు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చేస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube