డబ్బులు ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టాలని, తమ డబ్బును రెట్టింపు చేసుకోవాలని చాలామందికి ఉంటుంది.పెద్ద పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెట్టడం వల్ల తమకు అధిక ఆదాయం వస్తుందని ఆశ పడుతూ ఉంటారు.
కానీ చాలామందికి డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలనే విషయం తెలియదు.ఎలా ఇన్వెస్ట్ చేయాలనే విషయం తెలిసినా.
ఏ కంపెనీలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయనే విషయం తెలియక ఏదోక కంపెనీలో పెట్టి నష్టపోతూ ఉంటారు.ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉండాలి.

అయితే అమెరికన్ కంపెనీలలో( American companies ) కూడా మనం పెట్టుబడి పెట్టవచ్చు.ఇందుకోసం అనేక యాప్ లు అందుబాటులోకి వస్తాయి.ఈ యాప్ ద్వారా అమెరికన్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చు.ఇందుకోసం అనేక స్టార్టప్ కంపెనీలు యాప్( Startup companies app ) లను తీసుకొస్తున్నాయి.
కొన్ని యాప్‌లలో ట్రేడింగ్ సౌకర్యం అందుబాటులో ఉండదు.పెట్టుబడి పెట్టడానికి మాత్రమే అవకాశం ఉంటుంది.
ఇక మ్యూచువల్ లేదా ఈటీఎఫ్ ల ద్వారా పరోక్షంగా అమెరికా స్టాక్ మార్కెట్ లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు.యూఎస్ స్టాక్ మార్కెట్లు, అక్కడి మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడి పెట్టే అనేక మ్యూచువల్ ఫండ్ లు ఉన్నాయి.
వీటి ద్వారా మీరు యూఎస్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయవచ్చు.

ఇక ఎక్చ్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ద్వారా కూడా యూఎస్ స్టార్ మార్కెట్( US star market ) లో పెట్టుబడి పెట్టవచ్చు.భారతీయ లేదా విదేశీ బ్రోకర్ల నుంచి ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయవచ్చు.లేకపోతే అంతర్జాతీయ సూచీలలో పెట్టుబడి పెట్టే ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయవచ్చు.
అమెరికాలో అతి పెద్ద ఐటీ, స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి.వాటిల్లో పెట్టుబడి పెట్టడం వల్ల అధిక ఆదాయం మీకు వస్తుంది.సంవత్సరంలో 2.5 లక్షల డాలర్లు అమెరికా స్టాక్ మార్కెట్ లో భారతీయుడు పెట్టుబడి పెట్టవచ్చు.అంటే సంవత్సరానికి రూ.2 కోట్ల పెట్టుబడ్డి పెట్టే వెసులుబాటు ఉంది.







