పాతబడిన వాహనాలను ఉపయోగిస్తున్నారా..?! ఇకపై ఈ కొత్త టాక్స్ కట్టాల్సిందే..!

ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరు బైక్, కార్ ఇలా ఇతర వాహనాలు వినియోగం మరింత ఎక్కువైంది.ఈ తరుణంలో కాలుష్యం పెరిగిపోయే అనేక అవకాశాలు చాలానే కనబడుతున్నాయి.

 Do You Use Old Vehicles You No Longer Have To Pay This New Tax-TeluguStop.com

ప్రతి ఒక్కరు వాహనాలు వినియోగించడం వలన ట్రాఫిక్ జామ్ తో పాటు, పలు కాలుష్య సమస్యలు తలెత్తే అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి.దీంతో దేశంలో కాలుష్యాన్ని తగ్గించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

కాలుష్యం తగ్గించే నిబంధనలలో భాగంగా పాతపడిన వాహనాలకు గ్రీన్ టాక్స్ ను పెట్టించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రవాణా శాఖ అధికారులు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అందజేయగా, నితిన్ గడ్కరీ ఆ ప్రతిపాదనలను అప్రూవ్ చేసినట్లు సమాచారం.అన్ని రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు నిర్వహించగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, కేంద్ర ప్రభుత్వం దీనిపై నోటిఫై చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

8 సంవత్సరాలు పైబడి ఉన్న రవాణా వాహనాలు అన్నిటిని కూడా 10 నుండి 25 శాతం దాకా గ్రీన్ టాక్స్ చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.ఈ గ్రీన్ టాక్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసిన సమయంలో అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం.అంతేకాకుండా 15 సంవత్సరాల కంటే ఎక్కువగా పాతపడిన వ్యక్తిగత వాహనాల కూడా ఈ గ్రీన్ టాక్స్ వహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఇది ఇలా ఉండగా.మరోవైపు హైబ్రిడ్, ఎలక్ట్రికల్, ఎల్పిజి లాంటి వాహనాలను ఉపయోగించే వారికి ఈ గ్రీన్ టాక్స్ మినహాయింపు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube