ఏటీఎం లో డబ్బులు డ్రా చేసాక వచ్చే రిసిప్ట్ ను పడేస్తున్నారా.? ఈ విషయాలు తెలుస్తే ఇంకెప్పుడు అలా చేయరు.!

ATM ని ఉపయోగించని వారు ఎవ్వరు ఉండరు అనుకుంట.అవసరమైనప్పుడు డబ్బులు డ్రా చేసుకుంటూ ఉంటారు.

 Do You Throw Your Receipt After Money Draw From Atm-TeluguStop.com

అయితే చాలామంది ATM నుండి డబ్బులు డ్రా చేశాక.వచ్చే రిసిప్ట్స్ ను అక్కడే డస్ట్ డిన్ లో పడేయడమో….

లేదంటే బయట పడేయడమో చేస్తుంటారు.ఇలా చేయడం మంచిది కాదు…చిత్తు కాగితాలు అనుకున్న ఆ రిసిప్ట్స్ యే మీ అకౌంట్ గుట్టును హ్యాకర్ల చేతిలో పెట్టే కీ పాయింట్స్ గా మారతాయి.

అసలు ఆ రిసిప్ట్స్ పాడేయటం వల్ల వచ్చే నష్ఠాలు ఏంటి.?

ATM లో డబ్బులు డ్రా చేయాలంటే….దాని వెనుక చాలా పెద్ద ప్రాసెస్ జరుగుతుంది.స్టెప్స్ వైస్ మనం ఇచ్చే ఇన్ పుట్స్ ను బట్టి…మనం కోరిన డబ్బు మన చేతికందుతుంది.ఈ ప్రాసెస్ లో ఒక్కోసారి మిస్టేక్ జరిగి మీ డబ్బు డ్రా కాకుండానే.మీ అకౌంట్ లోని డబ్బు కట్ అయిపోతుంది.

అలాంటి సమయంలో బ్యాంక్ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడానికి మనకి పనికొచ్చేది రిసిప్ట్ ఏ.

ATM రిసిప్ట్ ను బట్టి…మీ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ ఎంత? …మీరు డ్రా చేసింది ఎంత? అనే విషయాలు తెలుస్తాయి.దానిని బట్టి మీరు ఎక్కువ డబ్బును డ్రా చేసి తీసుకెళుతున్నారని తెలిస్తే ….ఎవరైనా మిమ్మల్ని ఫాలో అయ్యి.మీ నుండి ఆ డబ్బును దొంగిలించే ప్రయత్నం చేసినా చేయొచ్చు.మీ ATM రిసిప్ట్…హ్యాకర్ల చేతికి చిక్కితే…దాని మీద ఉన్న సమాచారంతో …దానిని డీకోడ్ చేసి…మీ ATM పూర్తి వివరాలను రాబట్టి.

మీ అకౌంట్ లో ఉన్న డబ్బును మీకు తెలియకుండానే ఖాళీ చేసే ప్రమాదం కూడా ఉంది.

ఇలా చేయడం మంచిది:

రిసిప్ట్ తీసుకుంటే ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి.రిసిప్ట్ తీసుకునే బదులు మన అకౌంట్ కి ఫోన్ నెంబర్ ను జాయింట్ చేయించి.ప్రింట్ తీసుకోకపోవడమే బెటర్.ఎలాగో మన మొబైల్ కు మెసేజ్ వస్తుంది కాబట్టి… ఆ సమాచారం అంతా మనదగ్గర ఉంటుంది.ఇలా చేయడం వల్ల….

చెట్లను కాపాడమే కాకుండా, మన అకౌంట్ కు సంబంధించిన విషయాలను సేఫ్ గా ఉంచొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube