ప్రస్తుతం ప్రపంచంలో చాలా వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగం చేస్తున్నారని సంగతి అందరికీ తెలిసిందే.దీంతో చాలామంది ఎక్కువగా వారి జీవితాన్ని స్మార్ట్ ఫోన్స్ తోనే గడిపేస్తున్నారు.
అయితే ఇలా ఎక్కువసేపు మొబైల్ ఫోన్ చూస్తున్న వారికి స్క్రీన్ టైం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో మీకు తెలుసా.? అలాగే మీ మైండ్ సెట్ ఎలా మారుతుందో తెలుసా…? ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
తాజాగా ఓ జర్నల్ ప్రచురితం చేసిన అధ్యయనం ప్రకారం స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ ఉపయోగించేవారు ఎలాంటి ఆలోచన లేకుండా.మరుక్షణమే నిర్ణయం తీసుకుంటారని తెలియజేసింది.అంతేకాదు తక్షణం రివార్డులు వచ్చే వాటిపైన ఆసక్తి చూపుతారని, దీర్ఘమైన సమయంలో ఫలితాలు వచ్చే వాటిపై అసలు ఎలాంటి ఆసక్తి చూపరని తెలుపుతోంది.అంతేకాకుండా స్క్రీన్ టైం పెరగడం ద్వారా చాలామంది పేకాటలో మునిగిపోయి, ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం, డ్రగ్స్ కు బానిస కావడం లాంటి చెడు అలవాట్లకు బానిస అవుతున్నట్లు అధ్యయనంలో తేలింది.
ఇకపోతే సెల్ ఫోన్ లో ఆటలు, అలాగే సోషల్ మీడియా వివిధ రకాల యాప్స్ వల్ల వచ్చే రివార్డుల వల్ల వాటికి అలవాటు పడిపోయి డబ్బులు పెట్టాలంటే ఆలోచిస్తున్న స్థాయికి మారిపోయారని అందులో తేలింది.
ఈ అధ్యయనం ప్రకారం అమెరికా దేశంలో ఉన్న పెద్దలు ఏకంగా 12 గంటల వరకు స్క్రీన్ టైం ఎంజాయ్ చేస్తున్నట్లు తేలింది.
అయితే ఈ స్క్రీన్ టైం కరోనా వైరస్ రాకముందు అని తెలిపింది.ఇక అదే కరోనా వైరస్ తర్వాత లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండే పని చేయడం ద్వారా అది మరింతగా పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇందులో ఎక్కువగా వీడియో కంటెంట్ ఉన్న వాటిపై దృష్టి పెడుతున్నట్లు ఆ సర్వేలో తేలింది.ఈ విషయాలు మాత్రమే కాకుండా అనేక మంది అనారోగ్యం పాలు అవుతున్నట్టు వారి సర్వేలో తేలింది.
ఇందులో భాగంగానే ఎక్కువగా చాలామంది మెడనొప్పి, అలాగే వెన్నుపూసకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లు ఆ విషయంలో తేలింది.ఇందులో ముఖ్యంగా టీనేజర్లు ఏకంగా రోజుకు సరాసరి ఏడుగంటలకు తగ్గకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు తేలింది.
కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా గడుపుతున్న సమయమే 7 గంటల సమయం, ఆపై వేరే డివైజెస్ చూసే సమయం అదనం.