ప‌రిగ‌డుపున సిగ‌రెట్ తాగుతున్నారా.. అయితే అంతే ఇక‌..

మ‌ద్య‌పానం, ధూమ‌పానం ఆరోగ్యానికి హానికరం అని ప్ర‌తి చోట క‌నిపిస్తూనే ఉంటుంది.కానీ వీటిని మానేందుకు మాత్రం ఎవ‌రూ ముందుకు రారు.

 Do You Smoke Cigarettes On The Run But That's All, Cigarettes, Viral News,helth-TeluguStop.com

పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఏ మాత్రం నిబంధ‌న‌లు పాటించ‌కుండానే ఇష్టం వ‌చ్చిన‌ట్టు ధూమ‌పానం చేస్తూ ఉంటారు.మ‌రీ ముఖ్యంగా మ‌న దేశంలో ధూమపానానికి యువ‌త బానిస‌లుగా త‌యార‌వుతున్నారు.

ఈ చెడు అలవాట్ల‌ను మానేందుకు కూడా పెద్ద‌గా ఎవ‌రూ ఇంట్రెస్ట్ చూపింట్లేదు.అయితే ఈ ధూమ‌పానంలో మ‌రీ ముఖ్యంగా పరగడుపున సిగరెట్స్ తాగేవారి గురించి ఇప్పుడు ఓ విష‌యం సంచ‌ల‌నం రేపుతోంది.

మ‌న దేశంలో చాలామంది పొద్దున్నే సిగ‌రెట్ తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.ఇలా పరగడుపున సిగరెట్ తాగితే చాలా కిక్ వ‌స్తుంద‌ని కొంద‌రు లేదంటే మైండ్ ఫ్రీ అవుతుంద‌ని మ‌రి కొంద‌రు చెబుతుంటారు.

అయితే ఇలా ప‌ర‌గ‌డ‌పున సిగ‌రెట్ తాగితే అత్యంత డేంజర్ అని డాక్ట‌ర్లు చెబుతున్నారు.ఇలా పొద్దు పొద్దున్నే సిగరెట్స్ తాగే వారికి కేన్సర్ వచ్చే ప్ర‌మాదం చాలా ఎక్కువ అంటూ హెచ్చ‌రిస్తున్నారు.

అయితే ఇందులో కూడా మూడు రకాల కేన్సర్స్ ఇలాంటి వారికి వ‌స్తాయ‌ని డాక్ట‌ర్లు వివ‌రిస్తున్నారు.ఇంకో విష‌యాన్ని కూడా వెల్ల‌డిస్తున్నారు.

Telugu Cancer, Cigarettes, Smokecigarettes, Helth, Kidnees Failure-Telugu Health

అదేంటంటే ఇలా మార్నింగ్ లేవగానే ఎవ‌రైతే సిగరెట్స్ తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారో వారిలో కిడ్నీలు పాడ‌వుతాయ‌ని వివ‌రిస్తున్నారు.వీరిలో మూత్రపిండాలు స‌రిగ్గా పనిచేయ‌క క్ర‌మ క్ర‌మంగా క్షీణించి, పూర్తిగా పాడ‌య్యే చాన్సెస్ ఉంటాయ‌ని వెల్ల‌డిస్తున్నారు డాక్ట‌ర్లు.కాబట్టి ఇలా మార్నింగ్ స‌మ‌యంలో సిగ‌రెట్ తాగ‌కుండా బ్రేక్ ఫాస్ట్ లాంట‌వి చేస్తేనే మంచిద‌ని చెబుతున్నారు.క‌చ్చితంగా ప్ర‌తి ఒక్క‌రూ కూడా బ్రేక్ ఫాస్ట్, లంచ్ టైమ్‌కు తింటేనే ఇప్పుడున్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుని హెల్త్ బాగుంటుందని సూచిస్తున్నారు.

మ‌రి ఇప్ప‌టికైనా సిగ‌రెట్ మానేయాల‌ని మ‌నం కూడా కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube