రాత్రిళ్లు మొబైల్స్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా..?! అయితే ఇది మీ కోసమే..!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.మొబైల్ వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Mobile Chargeing, Night Time, Using, Phone Using, Night Charging, Mobile,saftey,-TeluguStop.com

ప్రతి ఒక్కరి చేతులలో స్మార్ట్ ఫోన్ కనిపించడం, ఫోన్ ను ఎక్కువగా వినియోగం రోజువారి భాగంలో ఒక ఒకటిగా అయిపోయింది.కొంతమంది అయితే ఒక్క క్షణం వారి చేతిలో మొబైల్ కనిపించకపోతే తెగ కంగారు పడిపోతుంటారు.

ప్రస్తుతం ప్రతి మనిషి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే పూర్తిగా మొబైల్ వినియోగమే అని చెప్పడంలో  ఎటువంటి సందేహం లేదు.అంతలా మొబైళ్లకు ప్రస్తుత యువత బానిస అయిపోయారు.

ఇంట్లో వారితో సమయం గడపడం పోయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ శాతం మొబైల్ లో గేమ్స్ ఆడుతూ, లేదా సినిమాలు చూడడం లాంటివి చేస్తూ ఉంటున్నారు.ఇలా పగలు మొత్తం మొబైల్ ఉపయోగిస్తూ ఉండడం ఒకవైపు అయితే మరోవైపు రాత్రి సమయంలో చార్జింగ్ పెట్టి వారి పక్కనే మొబైల్ పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు.

కానీ, చాలామందికి తెలియదు.ఇలా రాత్రి సమయంలో చార్జింగ్ పెట్టి వారి పక్కనే మొబైల్ పెట్టుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని, అలాగే చాలా ప్రమాదమని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇలా పరిమితిని మించి చార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్ బ్యాటరీ పూర్తిగా పనికిరాకుండా అయిపోవడంతో పాటు, పక్కనే పెట్టుకోవడం వల్ల ప్రాణాల మీదకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ కొన్న వారికి ఇలాంటి ప్రమాదం తలెత్తదు అని వారు తెలియజేస్తున్నారు.

ఇలా స్మార్ట్ ఫోన్ లో మొబైల్ ఛార్జింగ్ పూర్తి అయిన అనంతరం ఆటోమేటిక్ గా చార్జింగ్ ప్రక్రియ నిలిచిపోయేలా ఒక సాఫ్ట్ వేర్ ను తీసుకుని వచ్చినట్లు టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు.అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్ లే ఛార్జింగ్ పెట్టే సమయంలో పెలిపోయే సందర్భాలు ఎన్నో చూసే ఉంటాం.

సాధారణమైన కంపెనీ ఫోన్లను చార్జింగ్ సమయంలో పేరు అన్న గ్యారెంటీ ఎట్టిపరిస్థితిలో లేదు.అందుకొరకు మన జాగ్రత్తలో మనం ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని నిపుణులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube