బిగ్ బాస్ రన్నరప్ షన్ను లగ్జరీ ఇంటిని చూశారా.. ఎంత అందంగా ఉందో!

ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన సంగతి అందరికి తెలిసిందే.ఇందులో టైటిల్ విన్నర్ గా సన్నీ గెలవగా రన్నరప్ గా షణ్ముఖ్ సరిపెట్టుకున్నాడు.

 Do You See The House Of Bigg Boss Runner Shannu Details, Shannu, Bigg Boss 5, R-TeluguStop.com

షణ్ముఖ్ జస్వంత్ కెరీర్ మొదట్లో సోషల్ మీడియా ద్వారా షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.దీంతో మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు.

అలా సోషల్ మీడియా స్టార్ గా నిలిచి మంచి పేరు సంపాదించుకున్నాడు.ఎన్నో వెబ్ సిరీస్ లలో చేసి మంచి సక్సెస్ లను అందుకున్నాడు.

ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఇటువంటి క్రేజ్ ఎవరు తెచ్చుకోలేదనే చెప్పాలి.ఈయనకు ఒక స్టార్ హీరోకున్నంత ఫాలోయింగ్ ఉంది.

మరో సోషల్ మీడియా సెలబ్రేటి దీప్తి సునయన ద్వారా షణ్ముఖ్ గురించి బయటకు వచ్చింది.వీరిద్దరి మధ్య లవ్ కూడా నడుస్తుంది.

ఇక షణ్ముఖ్ కొత్త వెబ్ సిరీస్ ల కోసం ఆయన అభిమానులు తెగ ఎదురు చూస్తూ ఉంటారు.ఈయనకు సంబంధించిన ఏదైనా సిరీస్ విడుదలైతే చాలు అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది.

షన్ను డాన్స్ కూడా అద్భుతంగా చేస్తాడు.ఈయన డాన్స్ కు కూడా ఎంతోమంది అభిమానులున్నారు.

అలా ఈ గుర్తింపుతోనే షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు.ఇక ప్రతి ఒక్కరు షణ్ముఖ్ గెలుస్తాడని అనుకున్నారు.

చాలా వరకు షణ్ముఖ్ కోసం బిగ్ బాస్ చూసిన వాళ్లు కూడా ఉన్నారు.

కానీ షణ్ముఖ్ తొందరపాటు వల్ల ఆయన రన్నరప్ గా మిగిలిపోవలసి వచ్చింది.బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రోజుల వరకు మంచి ఫాలోయింగ్, మంచి పేరు సంపాదించుకున్న షణ్ముఖ్.ఆ పేరును మరో కంటెస్టెంట్ సిరి వల్ల కోల్పోయాడు.

తనతో కలిసి హౌస్ లో హద్దులు దాటి ప్రవర్తించాడు.

దాంతో అతడి ఫాలోయింగ్ మొత్తం చేజారిపోయింది.ఇక ఇటీవలే షణ్ముఖ్ ఓ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నాడు.అందులో తాను మాట్లాడిన కొన్ని మాటలు ప్రేక్షకులను కొంత వరకు ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా షణ్ముఖ్ లగ్జరీ హౌస్ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.

షన్ను సొంత ఊరు వైజాగ్ కాగా తన కెరీర్ కోసం హైదరాబాదు లోనే ఉంటున్నాడు.కానీ వైజాగ్ లో మాత్రం అతడి ఇల్లు చూస్తే షాక్ అవుతారు.తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు షణ్ముఖ్ హోమ్ టూర్ ను విడుదల చేశారు.

అందులో షణ్ముఖ్ తల్లి తమ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంది.

తమ ఇల్లును మొత్తం చూపించగా అందులో షణ్ముఖ్ ఫోటోలను, తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంది.

ఇక షణ్ముఖ్ కు ఇష్టమైన పెట్ లను కూడా చూపించగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షన్ను ఇల్లు నిజంగానే లగ్జరీగా ఉందని.

చూడటానికి చాలా అందంగా ఉందని అంటున్నారు.

Bigg Boss Fame Shanmukh Jaswanth Vizag Home Tour #ShanmukhJaswanth

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube