బెల్లీ డాన్స్ తో అదరగొట్టిన జాతి రత్నాలు బ్యూటీ.. చిట్టీలో ఈ టాలెంట్ కూడా ఉందా?

అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం జాతి రత్నాలు.ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి విపరీతమైన ఆదరణ సంపాదించుకుంది.

 Do You See Jati Ratnalu Heroine Belly Dance , Jati Ratnalu, Heroine, Faria Abdul-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమా ద్వారా హైదరాబాద్ బ్యూటీ ఫరియ అబ్దుల్లా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు.ఈ సినిమాతో ఈ పొడుగు కాళ్ళ సుందరి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఈ సినిమా తర్వాత ఈమె నాగచైతన్య నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా సందడి చేశారు.

జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో నటించిన ఫరియాకి చిట్టి అనే పేరు బాగా గుర్తింపు తెచ్చింది.

అప్పటినుంచి ఈ ముద్దుగుమ్మను అందరూ చిట్టి అని పిలవడం ప్రారంభించారు.ఇక జాతి రత్నాలు సినిమా తర్వాత పూర్తిస్థాయి హీరోయిన్ గా ఏ సినిమాలో చేయకపోయినా ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా నడిరోడ్డుపై తీన్మార్ స్టెప్పులతో అందరిని సందడి చేసిన చిట్టి తనకు డాన్స్ అంటే ఎంతో ఇష్టమని చెప్పకనే చెప్పేసారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొక డాన్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే ఈ వీడియోలో చిట్టి బెల్లీ డాన్స్ అదరగొట్టింది.ఈ వీడియోలో ఎంతో అద్భుతమైన పర్ఫామెన్స్ చేసిన ఈమెపై ఎంతో మంది అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

చిట్టిలో ఈ యాంగిల్ కూడా ఉందా బెల్లీ డాన్స్ అదరగొడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఈమె షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెటింట్ట వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube