ఆయన మాట : పాలు కూరగాయలు అమ్మి మహాకూటమి నడిపిస్తున్నారా ..?  

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమి లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు ఉన్నాయి. ఈ కూటమిలో ఉన్న టీడీపీ – కాంగ్రెస్ పార్టీలు బద్ద శత్రువులుగా మొన్నటి వరకు మెలిగాయి. అసలు టీడీపీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగింది. అటువంటి కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు ఎన్నికల కోసం 500 కోట్లు, 3 హెలికాప్టర్ల ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.తాజాగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఏకంగా మహాకూటమి ఖర్చు అంతా చంద్రబాబుదే అంటూ సెటైర్లు వేశారు.

Do You Run Mahakootami By Selling Milk Vegetables-

Do You Run Mahakootami By Selling Milk Vegetables

“తెలంగాణ ఎన్నికలకు మహా కూటమి అభ్యర్ధులందరికీ నాయుడు బాబే ఫైనాన్షియర్. కాంగ్రెస్ నేత గెహ్లాట్ రాహుల్ దూతగా అమరావతి వచ్చి బాబుతో జరిపిన భేటీ వెనుక రహస్యం ఇదే. మొత్తం మీద 1000 కోట్లు పెట్టడానికి డీల్. ఇదంతా పాలు, కూరగాయలు అమ్మితే వచ్చిన లాభం కదా! ” అని పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.