నోరు తెరచి చూస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.?- Do You Remember Who This Hero Is With His Mouth Open

Do you remember, who this hero ,his mouth open, hrithik roshan, amitabh bachchan, viral image, hrithik roshan childhood photo - Telugu Amitabh Bachchan, Do You Remember, His Mouth Open, Hrithik Roshan, Hrithik Roshan Childhood Photo, Viral Image, Who This Hero

బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ సోషల్ మీడియా ద్వారా తాజాగా తనకు సంబంధించిన ఒక పాత ఫోటోను షేర్ చేశారు.ఆ ఫోటోలో అమితాబచ్చన్ తొలిసారిగా ‘మిస్టర్‌ నట్వర్‌లాల్’ చిత్రంలో పాట పాడటానికి రిహార్సల్స్ చేస్తున్నారు.

 Do You Remember Who This Hero Is With His Mouth Open-TeluguStop.com

బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటోలో సంగీత దర్శకుడు రాజేష్ రోషన్ అమితాబచ్చన్ వైపు ఈ పాట సరిగా పాడగలుగుతాడ? లేదా? అన్న సందేహంతో చూస్తుండిపోయాడు.ఈ ఫోటోలో అమితాబచ్చన్ మాత్రం తన దృష్టంతా లిరిక్స్ పై పెట్టినట్లు కనిపిస్తుంది.

ఈ ఫోటోలో వీరిద్దరి మధ్యలో ఒక చిన్న పిల్లాడు కుర్చీలో కూర్చొని నోరు తెరుచుకొని అమితాబచ్చన్ వైపు ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు.ఆ విధంగా ఎందుకు నోరుతెరచి చూస్తున్నాడో అర్థం కావడం లేదు.

 Do You Remember Who This Hero Is With His Mouth Open-నోరు తెరచి చూస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బహుశా బిగ్ బి తొలిసారిగా పాట పడుతున్నందుకు అలా నోరు తెరుచుకుని చూస్తున్నాడ? లేక అక్కడ ఏం జరుగుతుందోనని తెలియక అలా చూస్తున్నాడ.ఇంతకీ ఆ బుడ్డోడు ఎవరు అనుకుంటున్నారు… అంటూ అతనే మన ఆలిండియా అందగాడు హృతిక్ రోషన్ అంటూ స్వయంగా అమితాబచ్చన్ ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

మొదటి సారిగా నేను మిస్టర్‌ నట్వర్‌లాల్‌ సినిమాలో ‘మేరే పాస్‌ ఆవో మేరీ దోస్త్‌’ పాట పాడాను.అయితే ఈ పాట రిహార్సల్స్ అక్కడ బెంచ్ పై కూర్చొని ఉన్న హృతిక్ పర్యవేక్షణలో జరిగాయంటూ ఫన్నీ క్యాప్షన్ జతచేశారు.ఇక ఆ హీరోతో కలిసి అమితాబచ్చన్ నటించింది కేవలం రెండు సినిమాలే 2001లో వచ్చిన ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ లో అమితాబ్‌ వ్యాపారవేత్తగా, హృతిక్‌ ఆయన కొడుకుగా నటించారు.2004లో వచ్చిన ‘లక్ష్య’ సినిమాలో వీళ్లిద్దరూ ఆర్మీ జవాన్లుగా నటించారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

#Do You Remember #Viral Image #HrithikRoshan #His Mouth Open #Who This Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు