తెలుగు ఆడియెన్స్ కమర్షియల్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడతారు.అది మంచి యాక్షన్ సినిమా అయితే ఇక హీరో ఎవరు అని కూడా చూడరు.
మూవీ బాగుంటే చాలు బంఫర్ హిట్ కావాల్సిందే.డబ్బింగ్ మూవీ అయినా ఫర్వాలేదు.
అలా డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నా హీరోలు చాలా మంది ఉన్నారు.అందులో కార్తీ మొదటి స్థానంలో ఉంటాడు.
చక్కటి ప్రవర్తనతో, మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు కార్తి.యుగానికి ఒక్కడు మూవీ నుంచి కార్తి తెలుగు జనాలకు పరిచయం అయ్యాడు.మంచి యాక్టింగ్ స్కిల్స్ తో అతి తొందర్లోనే తెలుగు ప్రేక్షలకు హృదయాలను దోచుకున్నాడు.ఇప్పుడు కార్తి మూవీ అంటే మినిమం గ్యారెంటీ అనే స్థాయికి చేరాడు.
తాజాగా సర్దార్ అనే మూవీని చేస్తున్నట్లు కార్తి వెల్లడించాడు.
ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కార్తి చాలా డిఫరెంట్ లుక్ తో కనిపించాడు.
మళ్లీ తన నుంచి డిఫరెంట్ మూవీ వస్తుందని ఆశించే అవకాశం కల్పించాడు.అయితే ఈ మూవీ టైటిల్ పాత సినిమా టైటిల్ లాగే ఉంది.కార్తి తెలుగులో చేసిన చాలా సినిమాల టైటిల్ లుక్ పాతవాటిని పోలి ఉన్నాయి.ఇంతకీ ఆ సినిమా టైటిళ్ల ముచ్చటేంతో ఇప్పుడు తెలుసుకుందాం.
కాష్మోరా
ఈ సినిమాలో కార్తి చాలా డిఫరెంట్ గా కనిపించాడు.అయితే ఈ సినిమా జనాలకు అంతగా ఎక్కలేదు.కానీ సేమ్ టైటిల్ తో తెలుగులో ఓ మూవీ ఉంది.1986లో రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ, శరత్ బాబు కలిసి నటించిన సినిమ కాష్మోరా.ఈ సినిమా స్టోరిని యండమూరి వీరేంద్రనాథ్ అందించారు.
చినబాబు
ఇదే టైటిల్ తో 1988లో తెలుగులో ఒక సినిమా వచ్చింది.ఇందులో నాగార్జున, అమల కలిసి నటించారు.
ఖైదీ
ఒక సింపుల్ కాన్సెప్ట్ ను అద్భుతమైన టేకింగ్ తో తీసిని సినిమా ఖైదీ.ఇది ఒక రాత్రి జరిగే స్టోరీని సినిమాగా తీశారు.ఇదే టైటిల్ తో గతంలో చిరంజీవి సినిమా చేశారు.ఆయన కెరీర్ లో ఓ బెస్ట్ మూవీగా నిలిచింది.
దొంగ
జ్యోతిక, కార్తి బ్రదర్, సిస్టర్ గా చేసిన సినిమా దొంగ.ఈ మూవీ మంచి విజయం సాధించింది.ఇదే టైటిల్ తో చిరంజీవి గతంలోనే ఓ సినిమా చేశాడు.ఇందులో చిరంజీవి సరసన రాధ నటించింది.
.
కార్తీ పోలీస్ అధికారిగా యాక్ట్ చేసిన ఈ సినిమా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కింది.ఇదే పేరుతో బాలీవుడ్ లో ఓ సినిమా తీశారు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, ఐశ్వర్యారయ్ ఈ సినిమాలో నటించారు.
సుల్తాన్
రీసెంట్ గా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా సుల్తాన్.ఈ సినిమా పేరు 1999లో బాలయ్య ఓ సినిమా చేశాడు.బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఈ టైటిల్ తోనే ఓ సినిమాలో నటించాడు.
సర్దార్
కార్తీ రీసెంట్ సినిమా సర్దార్.పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ అనే పేరుతో ఇప్పటికే ఓ సినిమా చేశాడు.