ఎం.ఎస్ ధోని వెళ్లే ఆ ఆలయం విశిష్టత మీకు తెలుసా?

Do You Konow The Historic Temple Of Devori

దేవోరి మాత ఆలయం జార్ఖండ్ లో ఉంది.ఆ రాష్ట్ర రాజధానికి 60 కిలోమీటర్ల దూరంలో రాంచి టాటా హైవేపై ఉంది.

 Do You Konow The Historic Temple Of Devori-TeluguStop.com

ఈ దేవాలయంలోని దేవతా విగ్రహం రూపం దాదాపు 700 ఏళ్ల పూర్వానికి చెందినది.మనం ఇన్నాళ్లు ఎనిమిది చేతులు కలిగిన దుర్గామాత విగ్రహాన్ని చూసి ఉంటాం.

కానీ దేవోరి మాతా విగ్రహం 16 చేతులతో మనకు దర్శనమిస్తుంది.ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ దేవాలయానికి భారత ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని తరచూ వెళ్లి దర్శించుకుంటూ ఉంటాడు.

 Do You Konow The Historic Temple Of Devori-ఎం.ఎస్ ధోని వెళ్లే ఆ ఆలయం విశిష్టత మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆలయం క్రీ.శ 1300 లో సింహ భూమికి చెందిన ముండా రాజు కేరా ఓ యుద్ధంలో ఓడిపోయి తిరిగి వస్తున్న సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించినట్లు చెబుతారు.

అంతే కాకుండా ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత కేరా రాజు కూడా తన సింహాసనాన్ని అధిష్టించాడు అని పురాణ కథనం.

ఈ మందిరంలో మూడున్నర అడుగుల కాళీ మాత విగ్రహం, 16 చేతులతో మనకు దర్శనమిస్తుంది.

అయితే ఇక్కడ గిరిజనులు వారి సంస్కృతి సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి ఆరు రోజులు పూజ చేస్తారు.మిగిలిన ఒక్క రోజు మాత్రమే బ్రాహ్మణులు పూజిస్తారు.

ఇంత చరిత్ర కలిగిన దేవోరి అమ్మవారిని పూజించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం.

దేవీ నవరాత్రుల అప్పుడు అమ్మవారికి ప్రత్యేక ఆభరణాలు అలంకరించి నవరాత్రి పూజలు నిర్వహిస్తారు.

నవరాత్రుల సమయంలో భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడుతుంది.ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి ఓ ఉత్సవం నిర్వహిస్తారు.

తీరికలేని షెడ్యూల్ తో ఎంతో బిజీగా గడిపే మహేంద్రసింగ్ ధోని అతనికి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అమ్మవారి దర్శనానికి వెళ్తారు.విదేశాలకు వెళ్లేటప్పుడు ముందు అమ్మవారిని దర్శించుకుని బయలుదేరుతాడు.2011 సంవత్సరంలో ప్రపంచ కప్ సాధించిన సమయంలో మొదటి ప్రార్ధన దేవోరి మాతకు చేయడం విశేషం.విజయానంతరం వెంటనే రాంచీకి చేరుకొని దేవోరి మందిరానికి వెళ్లి దుర్గమ్మను దర్శించుకున్నాడు ఎం.

ఎస్ ధోని.

#HistoricDeori #Jharkhand #DevoriMatha #MSDhoni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube