శ్రీకృష్ణుడు యాదవుల ఇంట పెరగడానికి గల కారణం ఏమిటో తెలుసా?

సాధారణంగా యాదవులు (గొల్ల వంశస్థులు) ఎక్కువగా శ్రీకృష్ణుడికి పూజలు చేస్తుంటారు.ఈ విధంగా యాదవులు కృష్ణుడికి పూజ చేయడానికి గల కారణం ఏమిటి.? కేవలం యాదవులు మాత్రమే కృష్ణుడిని పూజ చేయడం వెనుక ఎలాంటి కథనం దాగి ఉంది అనే సందేహం చాలామందికి కలుగుతుంది.మరి కృష్ణుడికి యాదవుల ఇంట పెరిగి, వారి చేత పూజలు చేయించుకోవడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

 Do You Knowthe Reason Why Lord Krishna Grew Up In The House Of Yadavs , Lord Kri-TeluguStop.com

పురాణాల ప్రకారం లోక సంక్షేమం కోసం బ్రహ్మదేవుడు పుష్కర తీర్థంలో యజ్ఞం చేయాలని పరమేశ్వరుడుతో చెబుతాడు.ఈ క్రమంలోనే శివయ్య నేను అన్నీ చూసుకుంటాను మీరు యజ్ఞం కానివ్వండి అంటూ బ్రహ్మదేవుడికి భరోసా ఇస్తాడు.

వెంటనే బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడానికి మంచి ముహూర్తం నిర్ణయించి అందరికీ ఆహ్వానం పంపుతాడు.ఈ క్రమంలోనే ముహూర్త సమయం దగ్గర పడుతుండటంతో బ్రహ్మదేవుడు సావిత్రిని తీసుకురావాల్సిందిగా ఇంద్ర దేవుడిని పంపిస్తాడు.

ఈ క్రమంలోనే ఇంద్రుడు సావిత్రి దగ్గరికి వెళ్లి బ్రహ్మ చేస్తున్నటువంటి యజ్ఞం గురించి తెలియజేసి రావాల్సిందిగా సూచిస్తాడు.ఈ క్రమంలోనే సావిత్రి తన వాళ్ళు ఇంకా ఎవరూ రాలేదని, వారు వచ్చే సమయానికి అక్కడికి వస్తానని చెప్పి పంపుతుంది.

ఇదే విషయమై ఇంద్రుడు బ్రహ్మ కు చెప్పగా ముహూర్తానికి సమయం మించిపోతుంది ముహూర్తం దాటిపోయిన తర్వాత కార్యం నిర్వహించకూడదని అంతలో ఈ కార్యం ముగించాలంటే ఎవరైనా కన్యను చూడండి.ఆమెను భార్యగా పొంది యజ్ఞాన్ని పూర్తి చేద్దామని బ్రహ్మదేవుడు ఇంద్రుడికి ఆజ్ఞాపించాడు.

ఈ విధంగా బ్రహ్మ దేవుని మాటలు విని ఇంద్రుడు భూలోకం వెళ్లి కన్య కోసం వెతుకుతాడు.ఈ సమయంలోనే ఓ గొల్ల యువతి పెరుగు అమ్ముతూ కంటపడింది.

వెంటనే ఆమె చేయి పట్టుకొని ఇంద్రుడు బ్రహ్మ లోకానికి వెళ్లి విష్ణువు, పరమేశ్వరుడు, పెద్దగా ఉండి గాంధర్వ వివాహం జరిపించాడు.

ఈ క్రమంలోనే తమ ఇంటి పిల్లను ఎవరో ఎత్తుకెళ్లారని యాదవులందరు గొడవ చేస్తూ బ్రహ్మలోకానికి వెళ్తారు.ఈ క్రమంలోనే విష్ణువు అక్కడికి చేరుకొని మీ అమ్మాయిని బ్రహ్మదేవుడు వివాహం చేసుకున్నారు.నేను శ్రీమన్నారాయణుడిని నేను కృష్ణ అవతారం ఎత్తినప్పుడు మీ వంశంలోనే, మీ మధ్యనే ఉంటాను.

మీరందరూ నన్ను దర్శించుకోవడం వల్ల మీ వంశాలు వృద్ధి చెందు తాయని ఈ సందర్భంగా శ్రీమన్నారాయణుడు చెప్పడం చేత విష్ణుదేవుడు కృష్ణుడు అవతారంలో జన్మించి యాదవుల ఇంట పెరిగి వారి చేత విశేష పూజలు అందుకుంటున్నారు.

Do You Knowthe Reason Why Lord Krishna Grew Up In The House Of Yadavs , Lord Krishna, Yadavas, Worshiping, Muhura - Telugu Knowthelord, Lord Krishna, Muhura, Yadavas

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube