కిందపడిన పారిజాత పుష్పాలతోనే దేవుడికి ఎందుకు పూజ చేయాలో తెలుసా?

సాధారణంగా ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ పారిజాత పుష్పాలను ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు.ఎందుకంటే పారిజాత వృక్షం సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు కనుక ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండ కలుగుతుందని భావిస్తారు.

 Parijata Flower, Worship, Hindu Belives, Gods, Lord Vishnu-TeluguStop.com

పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్రగర్భం నుంచి ఉద్భవించింది.అనంతరం ఈ వృక్షాన్ని విష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువెళ్లగా తర్వాత ఈ యుగంలో సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకువచ్చాడు.

ఇలా భూలోకంలో ఉన్న ఈ పారిజాత వృక్షానికి పూసిన పుష్పాలు చెట్టుమీద కోయకుండా కిందికి రాలిన పుష్పాలను మాత్రమే ఏరుకొని స్వామికి సమర్పించాలని చెబుతారు.అలా కింద పడిన పుష్పాలతో స్వామికి ఎందుకు పూజ చేయాలి అనే విషయాలు చాలా మందికి తెలియక పోవచ్చు కేవలం పారిజాత పుష్పాలు మాత్రమే చెట్టు నుండి కోయకుండా ఎందుకు రాలిన పుష్పాలని ఏరుకొని పూజ చేయాలి అనే విషయానికి వస్తే.

సాధారణంగా ప్రతి వృక్షం భూమినుంచి ఉద్భవిస్తుంది కానీ పారిజాత వృక్షం మాత్రం సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చింది.

Telugu Gods, Hindu, Parijata Flower, Worship-Movie

ఇలా స్వర్గం నుంచి భూలోకంలోకి రావడం వల్ల ఈ వృక్షం నుంచి పూసిన పుష్పాలు మొదటిగా భూమిని తాకిన తర్వాత భగవంతుడికి సమర్పించాలని చెబుతారు.అందుకోసమే పారిజాత వృక్షం కింద ఆవుపేడతో అలికి నేల పై రాలిన పుష్పాలు ఏరుకొని భగవంతుడికి సమర్పించాలి.ఇక పారిజాత వృక్షం ఏ ఇంటి ఆవరణంలో అయితే ఉంటుందో ఆ ఇంటిలో సిరిసంపదలకు కొదవుండదని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube